ఏవిధమైన పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. అందులో పాల్గొని రూ. 30 వేలు పొందొచ్చు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న తరుణంలో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఏం వర్క్ చేస్తున్నామన్నది ముఖ్యం కాదు అంతిమంగా డబ్బు సంపాదిస్తున్నామా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. చిల్లిగవ్వ ఖర్చు లేకుండా ఏకంగా రూ. 30 వేలు సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కాంటెస్ట్ పేరుతో ఓ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఈ పోటీలో పాల్గొనడమే. కాంటెస్ట్ లో పాల్గొని విజేతగా నిలిస్తే రూ. 30 వేలు అందించనుంది ప్రభుత్వం. ఆ కాంటెస్ట్ ఏంటి? దాని విదివిధానాలు ఏంటో ఇప్పుడు తెలుససుకుందాం.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను తనిఖీ చేసి ఆ నివేదికలను శాసన సభ, పార్లమెంట్ లలో అందిస్తుంది కాగ్. అయితే ఆడిట్ దివస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సే కాంపిటీషన్ ను నిర్వహిస్తోంది. మై గౌ వెబ్సైట్లో ఈ కాంటెస్ట్ అందుబాటులో ఉంది. ఈ నేషనల్ ఆన్లైన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కాగ్ నిర్వహిస్తోంది. భారత ప్రజాస్వామ్యం- కాగ్ పాత్ర అనే టాపిక్ మీద వ్యాసం రాయాల్సి ఉంటుంది. కాగ్ సంస్థ గురించి యువతకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆసక్తి, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ కాంటెస్ట్ లో పాల్గొని మొదటి విజేతగా నిలిస్తే రూ. 30 వేలు, ద్వితీయ ప్రైజ్ రూ. 20 వేలు, తృతీయ ప్రైజ్ రూ. 15 వేలు అందిస్తారు.
ఎవరు అర్హులు
అయితే 25 ఏళ్లలోపు వయసు గలవారికి మాత్రమే ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. అంతేకాక ఏదైన యూనివర్సిటీలో చదువుతూ ఉండాలని పేర్కొంది. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగం ఉద్యోగులు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఒక వ్యక్తి ఒక వ్యాసం మాత్రమే రాసి పంపాలి. వ్యాసాన్ని 1500 పదాలకు మించి రాయొద్దు. ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో మాత్రమే ఎస్సే రాయాలి. దీనిని essay2023@cag.gov.in కు వ్యాపం పంపాలి. ఆగస్ట్ 20 వరకే ఈ కాంటెస్ట్ అందుబాటులో ఉంటుంది. కాగా ఆ లోపే ఎస్సే రాసి పంపించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అరుదుగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రూ. 30 వేలు సొంతం చేసుకోండి.