దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి బ్యాంకింగ్. ప్రజల ఆర్థిక లావాదేవీలకు మూల బిందువు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి పని తీరును పర్యవేక్షిస్తూ ఉంటుంది.
దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి బ్యాంకింగ్. ప్రజల ఆర్థిక లావాదేవీలకు మూల బిందువు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి పని తీరును పర్యవేక్షిస్తూ ఉంటుంది. పని తీరు లేదా లైసెన్సులు లేని, ఆర్థిక మోసాలకు పాల్పడే బ్యాంకులను నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ఆర్బీఐ మరో బ్యాంకు లైసెన్స్ రద్దు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఆ బ్యాంకు కస్టమర్లపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నట్లు తెలుస్తుంది. అయితే బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినప్పటికీ.. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థగా పనిచేసే అవకాశం ఉంది.
ఇంతకు ఆ బ్యాంకు ఏంటంటే.. మహాలక్ష్మి కోపరేటివ్ బ్యాంక్. కర్ణాటకకు చెందిన ఈ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ. జూన్ 27 నుండి దీని బ్యాంకింగ్ సేవలను నిలిపివేసింది. 1994 మార్చిలో మహాలక్ష్మి కోపరేటివ్ బ్యాంకుకు ఆర్బీఐ బ్యాకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. ఆర్బీఐ గత కొంత కాలంగా కోఆపరేటివ్ బ్యాంకులపై డేగ కన్నువేసింది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతోంది. వీటిల్లో లోపాలు ఉన్నట్లు తేలితే.. చర్యలకు ఉపక్రమిస్తుంది. బ్యాంకు పని తీరు మెరుగుపర్చుకుంటే.. బ్యాంకు సేవను కొనసాగిస్తుంది లేదంటే బ్యాంకింగ్ సేవలను రద్దు చేస్తోంది. ఇందులో భాగంగానే కొరడా ఝుళిపిస్తుంది.
గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ నాటి నుండి 9 సహకార బ్యాంకులు లైసెన్సులు రద్దు చేసింది. టెక్స్టైల్ ట్రేడర్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఉజ్జయిని నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, పానిహతి కో-ఆపరేటివ్ బ్యాంక్, ది బెర్హంపూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, షోలాపూర్ సిద్ధేశ్వర్ సహకరి బ్యాంక్, ఉత్తరప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఉత్తర్పరా కో- ఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి. వీటికి జరిమానాలు కూడా విధించింది. దీన్ని బట్టి చూస్తే డబ్బులు దాచుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. బ్యాంకులు దివాలా తీస్తే.. ఖాతాదారులు సొమ్ములు స్వాహా అయినట్లే. ఫిక్స్డ్ డిపాజిట్ల దగ్గర నుండి ఇతర సేవింగ్స్ చేసే విషయంలో ఏ బ్యాంకులో సేఫో నిర్ణయం తీసుకుని అందులో డబ్బులు పెట్టుబడి పెట్టుకోవాలి.