తాగు బోతు భర్తను మార్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లు చేయని ప్రయత్నముండదు. చివరకు ఇంటి నుండి వెళిపోతామని బెదిరించినా కూడా భార్యనైనా వదిలేస్తారు కానీ మద్యాన్ని విడిచిపెట్టరు. కానీ తన తాగుబోతు భర్తను మార్చుకునేందుకు ఓ మహిళ చేయని సాహసం చేసింది.
మద్యానికి బానిసవుతున్న భర్తతో ఇంటిల్లిపాది బాధపడుతుంటారు. రోజు తాగడం, ఇంటికి వచ్చిన గొడవ పడటం చేస్తుంటారు. తాగుబోతు భర్త కారణంగా ఇల్లు గుల్లవుతుంది. భర్తకు తాగొద్దని చెప్పినా తన పంథాను మార్చుకోడు. తాగు బోతు భర్తను మార్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లు చేయని ప్రయత్నముండదు. చివరకు ఇంటి నుండి వెళిపోతామని బెదిరించినా కూడా భార్యనైనా వదిలేస్తారు కానీ మద్యాన్ని విడిచిపెట్టరు. కానీ తన తాగుబోతు భర్తను మార్చుకునేందుకు ఓ మహిళ చేయని సాహసం చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నచందంగా అతడిని మార్చేందుకు ఆమె కూడా మద్యానికి బానిసైంది. వినడానికే వింతగా ఉన్న ఈ వార్త మాత్రం నిజం. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
భర్తను తాగుడి నుండి బయటపడేసేందుకు అతడి మార్గాన్నే ఎన్నుకుని ఈ కాలం పతివ్రతగా మారింది ఓ మహిళ. భర్తను మార్చే క్రమంలో ఆమె కూడా బానిస అయ్యింది. చివరకు భర్తకు తెలిసొచ్చింది. ఇంతకు అతడు మారాడా లేక ఆమె మారిపోయిందా అనేది తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళతో భర్త రోజు తాగొచ్చి గొడవ పడేవాడు. రోజూ తగాదాలు జరుగుతుండటంతో విసిపోయిన మహిళ.. అతడి మద్యం మాన్పించేందుకు తాను తాగుబోతులా నటించాలని నిర్ణయం తీసుకుంది. నటించడం మొదలు పెట్టింది. అలా నటించే క్రమంలో ఆమె మద్యానికి బానిసైంది. తాగి అతడు ఆమె పట్ల ప్రవర్తించినట్లుగానే.. మహిళ కూడా తన భర్తతో గొడవ పడేది. దీంతో ఖంగుతిన్న భర్త ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఆశ్రయించాడు.
కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఇద్దరు మద్యం సేవించి వెళ్లి.. దూషించుకున్నారు. భార్య తనపై చేసిన దాడి వీడియోను భర్త కౌన్సెలర్‌కు చూపించాడు. తన భార్య మద్యానికి బానిస అయ్యిందని, తమ పరువంతా పోయిందని గొల్లుమన్నాడు. అయితే భార్య చివరకు అసలు విషయాన్ని బయట పెట్టింది. భర్త నిత్యం మద్యం సేవించి, తనతో గొడవ పడేవాడని, అతడ్ని మాన్పించే క్రమంలో తాను తాగుబోతులా మారి నటించినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే తాను తాగాల్సి వచ్చిందని చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న కౌన్సెలర్.. దంపతులతో రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారు.వారానికి ఒకసారి మాత్రమే తాగుతానని కౌన్సెలర్ సమక్షంలో భర్త లిఖితపూర్వక హామీ ఇచ్చాడు. తన భార్యతో ఎప్పుడూ గొడవపడనని, వాదించనని కూడా హామీ ఇచ్చాడు.