ఓ ఛానల్‌లో ప్రసారమౌతున్న టెలీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్‌లోనే లీడ్ రోల్‌లో నటిస్తున్నారు మన స్టార్, బోల్డ్ నటి కస్తూరి. అయితే ఈ సీరియల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 18 నాటి ఎపిసోడ్‌తో వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
ఓ ఛానల్‌లో ప్రసారమౌతున్న టెలీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. అత్యధిక రేటింగ్‌తో దూసుకెళ్లిన కార్తీక దీపం సీరియల్ ముగిసిపోవడంతో ప్రస్తుతం వేరే దారి లేక ఈ సీరియల్ చూస్తున్నారు మహిళా అభిమానులు. ఈ సీరియల్‌లోనే లీడ్ రోల్‌లో నటిస్తున్నారు ఒకప్పటి హీరోయిన్, బోల్డ్ నటి కస్తూరి. అయితే ఈ సీరియల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 18 నాటి ఎపిసోడ్‌తో వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. కార్తీక దీపం తర్వాత ఈ అరుదైన ఫీట్ సాధించిన ధారావాహికగా నిలిచింది. 2020 ఫిబ్రవరి 3న ఓ ఛానల్లో ప్రారంభమైన ఈ సీరియల్.. ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. దీన్ని శ్రీమోయి అనే బెంగాలీ సీరియల్ నుండి రీమేక్ చేశారు. ఇప్పటికే అనేక భాషల్లో ఈ సీరియల్ రీమేక్ అయ్యి ఆయా భాషల్లోనూ క్లిక్ అయ్యింది.
అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ కథను మార్చారు. ఇందులో తులసి (కస్తూరి)చుట్టూ కథ అల్లుకుని ఉంటుంది. భర్త మరో స్త్రీ (లాస్య) మోజులో పడి ఆమెను దూరం పెట్టినా.. మహా సాధ్విలా సవితిని తెచ్చుకుని (భార్యే భర్తకు మరో వివాహం చేయడం ట్విస్ట్) ఇంట్లో పెట్టుకోవడం.. భర్త రెండో భార్య నిజస్వరూపం తెలిసి.. మొదటి భార్యకు దగ్గరవ్వడం వంటి కథనాలతో సీరియల్ సాగదీస్తున్నారు. ఇప్పుడు వీరికి పుట్టిన బిడ్డ దివ్యకు విక్రమ్ అనే యువకుడితో పెళ్లి అవుతుంది. దివ్యకు, తులసికి అడుగడుగునా అడ్డంకులు, ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది తులసి సవితి లాస్య. దివ్య అత్తగారు రాజ్యలక్ష్మితో కలిసి కొత్త దంపతుల కాపురాన్ని కూల్చడానికి ప్లాన్ చేస్తుంటుంది లాస్య. ఆ కుట్రలను తిప్పికొడుతుంటారు అమ్మ కూతుళ్లు తులసి, దివ్య.
అయితే ఈ పెళ్లి జరిగి కనీసం మూడు నెలలు దాటిపోతుంది. ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరిగింది. అయితే అప్పటి నుండి వీరి శోభనం మాత్రం జరగడం లేదు. ఇప్పుడు వీరి శోభనం ఆపేందుకు కుట్రలు పన్నుతారు లాస్య, రాజ్యలక్ష్మిలు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో కొత్త దంపతులకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు. అంతకుముందు కుటుంబ సభ్యుల మధ్య బంతాట ఆడిస్తున్నారు. తర్వాత స్వీట్ ఆట ఆడించారు. ఇక శోభనం గదిలోకి పంపించేటప్పుడు ఐస్ క్రీమ్ ఆట. ఏంటో చూస్తున్నాం కదా అని శోభనాన్నే వెయ్యి ఎపిసోడ్లు చేసేటట్లు ఉన్నారు. కొత్త దంపతులను ఎంకరేజ్ చేస్తూ మధ్యలో తులసి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అంతలో లాస్య ఆగండి అంటూ అనడంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.
మరి ఇంతకు వారి శోభనం అవుతుందో లేదో చూడాలి. పెళ్లై మూడు నెలలు కావస్తున్నా తొలి రాత్రి జరపడం కోసం 80 ఎపిసోడ్లు తినేశారు దర్శకులు. ఇక ఈ సీన్ పూర్తి చేయాలంటే ఎన్ని ఎపిసోడ్లు మింగేస్తాడోనంటూ మహిళా అభిమానులు ఫీల్ అవుతున్నారట. ఇదేం కర్మరా బాబు.. ఈ శోభనం గోలంటీ అంటూ ఇంకా ఎన్ని రోజులు ఈ ఎపిసోడ్లే చూడాల్సి వస్తుందోనని తలలుపట్టుకుంటున్నారు. నయా దంపతులకు తోడు.. ఓల్డ్ దంపతుల నట విన్యాసాలు చూడలేక చస్తున్నారు జనాలు. ఓ సీరియల్ అంటే కుటుంబం మొత్తం కూర్చుని చూస్తుంది. అలాంటి సీరియల్ లో శోభనం చుట్టూ కాన్సెప్ట్ పెట్టి ప్రేక్షకులకు ఏం చూపిద్దామని దర్శకుడు ఆలోచిస్తున్నాడో ఆయన విజ్ఞతకే తెలియాలి. ఈ సీరియల్ ప్రస్తుత సీన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.