ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రీఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు డెల్టా వేరియంట్ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. తాజాగా డబ్ల్యూహెచ్ వో మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఫోర్త్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. కరోనా డెల్టా వేరియంట్ ప్రమాదకారిగా మారుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
సాంస్కృతిక వేదికలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లేవారు తప్పని సరిగా కరోనా టీకా తీసుకున్న సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదా కరోనా నుంచి కోలుకున్న పత్రాలను చూపించాలంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో 22 దేశాలు ఉంటే, 15 దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. ఆక్సిజన్ ట్యాంకుల కొరత, ఐసీయూ బెడ్ల కొరత ఆసుపత్రులను వేధిస్తోంది.
ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని డబ్ల్యూహెచ్ వో మరోసారి స్పష్టం చేసింది. ధనిక దేశాలు పేద దేశాలకు అండగా నిలవాలని, వారికి వ్యాక్సిన్లు సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్ వో సూచించింది. సెప్టెంబర్ నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 10 శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాలని డబ్ల్యూహెచ్ వో టార్గెట్ గా పెట్టుకుంది.
2021 ఏడాది చివరి నాటికి 40శాతం, 2022 జూన్ నాటికి 70శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది డబ్ల్యూహెచ్ వో టార్గెట్. అయితే ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ధనిక దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్లు విరాళం చేయాలి. అప్పుడే డబ్ల్యూహెచ్ వో అనుకున్న వ్యాక్సినేషన్ టార్గెట్ రీచ్ కాగలదు.