నగరాల్లో దోమల లార్వా అభివృద్ధి విపరీతంగా పెరిగిందని, గరిష్టంగా హైదరాబాద్ లో 46శాతం ఉందని తెలిపింది.కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టిందో లేదో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి.ఈ లెక్కన నగర వాసులకు డెంగ్యూ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఇది పెరిగిందని, ప్రతీ జిల్లాలో 10% పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు, హైదరాబాద్ లోని ఫీవర్, నీలోఫర్, ఉస్మానియా మొదలగు ఆస్పత్రుల్లో డెంగ్యూ కిట్లు సిద్ధం […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రీఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు […]
కరోనా వైరస్‌ను కట్టడి చెయ్యడంలో ‘రోల్ మోడల్’గా నిలిచిన కేరళలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఒక్కరోజే కేరళలో కొత్తగా 22,129 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా […]
మే 2020లో కొవిడ్-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం చేయడం ద్వారా మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే, సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది. ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కరోనా భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు […]