ఉత్తరకొరియాలో వంశ పారంపర్య పాలన సాగుతుందా? అంటే మీడియా అవుననే అంటున్నాయి. పదేపదే కుమార్తెతో కనిపించడంతో పాటు మిగిలిన ఇద్దరు పిల్లల్ని కాదని, చిన్న కుమార్తెకు అరుదైన గౌరవ మర్యాదలు ఇస్తుండటం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. తాజాగా జరిగిన సైనిక పెరేడ్ లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ పరేడ్ లో ఆయన భార్య కూడా పాల్గొనగా.. ఆమె ధరించిన ఓ వస్తువు పై అందరి దృష్టి పడింది.
ఉత్తరకొరియా. పేరుకు చిన్నదేశమైనా.. ప్రపంచ దేశాలు వణుకుతాయి. ఏ దేశంలోని లేని అణ్వాయుధ సంపద ఉత్తర కొరియాకు సొంతం. తన అణు క్షిపణులతో బలప్రదర్శన చేపట్టి.. అగ్ర రాజ్యం అమెరికాకు సవాలు విసురుతూ ఉంటుంది. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయని, మీడియా స్వేచ్ఛ ఉందంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ దేశానికి అధ్యక్షుడే కిమ్ జోంగ్ ఉన్. ఆయన నియంతలా దేశాన్ని పాలిస్తారంటూ ప్రపంచ మీడియా కోడై కూస్తూ ఉంటుంది కానీ వాస్తవాలు తెలియదు. ఆ దేశానికి సంబంధించిన విషయాల గురించి ప్రపంచానికి తెలియడం చాలా అరుదు. మిగతా దేశాధినేతలతో పోలిస్తే.. ఆయన కుటుంబ సభ్యులు సైతం అంతగా బయటకు కనిపించరు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన భార్య, కుమార్తెతో మెరిశారు కిమ్.
ఉత్తరకొరియా మిలటరీ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తరకొరియా రాజధాని పోంగ్యాంగ్ లో సైనిక కవాతు నిర్వహించారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రదర్శించారు. ఈ పరేడ్ కు ముందు అత్యున్నత సైనికాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కిమ్ భార్య రీ సోల్ జుతో పాటు కుమార్తె కిమ్ జుయేతో కలిసి ఆయన హాజరయ్యారు. కూతురితో కలిసి కిమ్ కనిపించడం ఇది ఐదవ సారి. అయితే ఇటీవల కాలంలో కుమార్తెను ఎక్కువగా బయటకు తీసుకురావడం వెనుక.. దేశ పగ్గాలు ఆమెకు అప్పగించాలని కిమ్ ఆకాంక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమావేశానికి భార్య రీ సోల్ పై ఇప్పుడు మీడియా కన్ను పడింది. ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్‌పై అంతా చర్చించుకుంటున్నారు.ఈ సైనిక కవాతుకు సంబంధించిన ఫోటోలను తాజాగా దేశ మీడియా విడుదల చేసింది.
ఇందులో కిమ్ భార్య రీ సోల్ మెడలో ధరించిన నెక్లెస్ గురించి చర్చనీయాంశమైంది. ఆ నెక్లెస్ ను పరిశీలించి చూస్తే .. అందులో ఓ లాకెట్ కనిపిస్తోంది. ఆ లాకెట్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (మిస్సైల్) ఆకారంలో ఉండటంతో మీడియాలో కథలు కథలుగా కథనాలు మొదలయ్యాయి. ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే బిబిసి పేర్కొంటున్న ప్రకారం ఆ లాకెట్ రూపం గత ఏడాది ప్రయోగించిన హ్వాసాంగ్ బాలిస్టిక్ క్షిపణిని పోలి ఉందని చెబుతుంది. అయితే సోషల్ మీడియా నెటిజన్లు దీనిని న్యూక్ లేస్ గా సంభోదిస్తున్నారు. కాగా, కిమ్ జోన్ కు ముగ్గురు పిల్లలు కాగా, ఆయన ఎక్కువగా చిన్న కుమార్తెతోనే కనిపిస్తుండటంతో.. తదుపరి ఆమె దేశాధినేత కానుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ సైనిక సమావేశంలో గౌరవ స్థానం కల్పించడం, అక్కడ మీడియా సైతం గౌరవమైన, ప్రియమైన అని సంభోధించడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లువుతోంది.తన చర్యలతో అగ్ర రాజ్యం అమెరికానే వణికిస్తున్న కిమ్ పై మీ అభిప్రాయాన్ని కామెంటర్ల రూపంలో తెలియజేయండి.
Kim Jong-un’s wife seen wearing ‘InterContinental ballistic missile’ necklace.#KIMJIWOONG #NorthKorea pic.twitter.com/zFmK2xHRug
— OSINT Expert (@BeAawaree) February 10, 2023