పాపం ఉత్తరకొరియా ప్రజలు! ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న మరో నిర్ణయం దెబ్బకు తెగ బాధపడుతున్నారు. నెటిజన్స్ అయితే ఇదెక్కడి డెసిషన్ రా మావ అని మాట్లాడుకుంటున్నారు.
నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశ ప్రజల ప్రాణాలతో పాటు పొరుగు దేశాల వాసులనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన పనికి లక్షలాది మంది ప్రాణాలకు రిస్క్ ఏర్పడిందని ఓ అధ్యయనం వెల్లడించింది.
నియంత్రత్వ పాలనకు పెట్టింది పేరుగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ను చెప్పుకుంటారు. ప్రజలు ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రతిదీ శాసించే డిక్టేటర్‌గా ఆయన్ను పిలుస్తుంటారు. అలాంటి కిమ్ ఇప్పుడు మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు.
ఉత్తరకొరియాలో వంశ పారంపర్య పాలన సాగుతుందా? అంటే మీడియా అవుననే అంటున్నాయి. పదేపదే కుమార్తెతో కనిపించడంతో పాటు మిగిలిన ఇద్దరు పిల్లల్ని కాదని, చిన్న కుమార్తెకు అరుదైన గౌరవ మర్యాదలు ఇస్తుండటం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. తాజాగా జరిగిన సైనిక పెరేడ్ లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ పరేడ్ లో ఆయన భార్య కూడా పాల్గొనగా.. ఆమె ధరించిన ఓ వస్తువు పై అందరి దృష్టి పడింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్రూరమైన మనస్తత్వం కలవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం కోడైకూస్తోంది. అతడి నాయకత్వంలో నడుస్తున్న ఉత్తర కొరియా ప్రభుత్వం కూడా క్రూరమైన పాలనను అందిస్తోంది. దేశ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్రాలు మొత్తం హరించి, వారిని బానిసలుగా మార్చి పాలన సాగిస్తోంది. ప్రస్తుత అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్ క్రూర బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు చిన్న చిన్న తప్పులకు కూడా ప్రాణాలు తీసే […]
North Korea: ఉత్తర కొరియా అంటే ఓ భయంకరమైన దేశం అని చాలా మంది అభిప్రాయం. వాళ్లలా అనుకోవటానికి కారణం లేకపోలేదు. కిమ్ వంశస్తుల రాక్షస పాలన కారణంగా ఆ దేశానికి ఆ పేరు వచ్చింది. అక్కడ ప్రజలపై విపరీతమైన ఆంక్షలు ఉంటాయి. కేవలం ప్రజలు మాత్రమే కాదు.. ప్రెస్, పర్యాటకంపై కూడా ఆంక్షలు ఉంటాయి. అలాంటి ఆ దేశానికి టూరుకు వెళ్లాలని ఎవరు అనుకుంటారు చెప్పండి. కానీ, కొంతమంది మాత్రం ప్రాణం మీద ఆశలు వదులుకుని […]
అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నియంతగా మళ్లీ అంతటి పేరు సాధించిన వ్యక్తి ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. ఎప్పుడూ ఆయన నిర్ణయాలు, ఆదేశాలతో దేశ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. ఆ నిషేదాలు, ఆజ్ఞలు చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆదేశాలే జారీ చేశాడు కిమ్. పదకొండు రోజుల పాటు ఆ దేశంలో ఎవ్వరూ నవ్వకూడదు, మద్యం సేవించ కూడదు అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఆయన తండ్రి పదో […]
ఉత్తర కొరియా నేడు మొట్టమొదటి మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ విషయాన్ని ‘వాయిస్ ఆఫ్ కొరియా’ పేర్కొంది. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ […]
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి కిందటి ఏడాది రకరకాల పుకార్లు వినిపించాయి. ఒక టైంలో కిమ్ చనిపోయాడనే వార్తలు ప్రపంచానికి ఎంతో ఆసక్తిని కలిగించాయి. వారం తిరగకముందే మీడియా ముందు ప్రత్యక్షమై తాను నిక్షేపంగా ఉన్నానని శత్రు దేశాల గట్టి సందేశం పంపాడు కిమ్. నియంతలకే నియంతగా ముద్రపడ్డ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎప్పుడు ఏ వార్త బయటకొచ్చినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది. కిమ్‌కి సంబంధించిన […]