Hong Kong: స్టేజ్‌ల మీద పెర్ఫార్మ్ చేసే లైవ్ షో అందరికీ కనిపించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఇదే ఇప్పుడు ఇద్దరి డ్యాన్సర్ల ప్రాణానికి ముప్పు తెచ్చింది. హాంకాంగ్‌లో జరిగిన మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేజ్‍పై డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఒకటి జారి డ్యాన్సర్ల మీద పడింది. ఒక డ్యాన్సర్ మీద డైరెక్ట్‌గా పడడంతో తలకు గాయమైంది. మరొక డ్యాన్సర్‌కి మెడ మీద గాయమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే షోని మధ్యలోనే ఆపేసి, ప్రేక్షకులను అక్కడి నుండి పంపించేశారు. అనంతరం ఆ డ్యాన్సర్స్‌ని హాస్పిటల్‌కు తరలించారు. ఒకరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 25న ప్రారంభమైన ఈ షో ఆగస్ట్ వరకూ సాగాల్సి ఉంది. మొత్తం 12 షోలు జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఇలా జరగడంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు.
ఇక ఈ ప్రమాదంపై స్పందించిన హాంకాంగ్ ప్రభుత్వం.. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలో ఎలాంటి షోలు నిర్వహించకూడదని నిషేధించింది. అలాగే హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీని ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా ఈ మిర్రర్ పాప్ బ్యాండ్ ఇస్తున్న కాంటోనీస్ పాప్ సంగీత ప్రదర్శన.. చైనీస్ భాషలో ఉంటుంది. 1970 నుంచి హాంకాంగ్‌లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే 2000లలో ఈ సంగీతంపై జనాలకి ఆసక్తి తగ్గడంతో మళ్ళీ ఆసక్తిని పెంచేందుకు మిర్రర్ పాప్ బ్యాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వాళ్ళు నిర్వహించిన షోలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Hong kong 🇭🇰 Un écran géant est tombé ce soir sur deux chanteurs du groupe Cantopop Mirror 🙏😭 Une défaillance technique impardonnable !! pic.twitter.com/Z1pYjOf1gw
— Kathy 까티씨⁷ ᴮᴱ💜😷✈🌍 🇰🇷🇯🇵 (@melody_747) July 28, 2022