Shinzo Abe: జపాన్‌లో దారుణం చోటు చేసుకుంది. మాజీ ప్రధానమంత్రిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) మృత్యువుతో పోరాడి ఆయన కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే.. నరా నగరంలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న షింజోపై దుండగులు రెండుసార్లు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనలో షింజో ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబేను వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. హాస్పిటల్ చేరేలోపే ఆయన పరిస్థితి విషమించి పోవడంతో కాపాడలేకపోయామని అధికారులు ప్రకటించారు. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ క్రమంలో కాల్పులు జరిగిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Officials say former Japanese Prime Minister #ShinzoAbe has been confirmed dead. He was reportedly shot during a speech on Friday in the city of Nara, near Kyoto: Japan’s NHK WORLD News pic.twitter.com/7ayJpNCw17
— ANI (@ANI) July 8, 2022
NHK is broadcasting the moment that Japanese Former PM Shinzo Abe was shot from behind. Video does not show the shooter, just the puff of smoke. pic.twitter.com/4CNW1JTmvn
— Global: MilitaryInfo (@Global_Mil_Info) July 8, 2022