ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వరు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది వయోభారంతో చనిపోతే.. మరికొంత మంది అనారోగ్యం, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో వారికుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. అభిమానుల్లో సైతం తీవ్ర విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన యువ గాయకుడు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ యువ గాయకుడు, పాటల రచయిత మిచి కోబిన్ సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా మిచి కోబిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స చేయించుకుంటున్న మిచి కోబిన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చనిపోయాడు. చిన్ననాటి నుంచి పాటలు పాడుతూ.. బాగా పాపులర్ అయ్యాడు మిచి. అంతేకాదు ఎన్నో పాటలు రచించాడు. ఆయన పాటలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో మిచి కోబిన్ కి ఫ్యాన్ ఫాలోయింగా బాగా ఉంది. AR01 బ్యాండ్ స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి బాగా పాపులర్ అయ్యాడు మిచి కోబిన్.
మిచి కోబిన్ మృతిపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సంతాపం తెలిపారు. ” ఏఆర్ 01 బ్యాండ్ కి గాయకుడిగా తన గాత్రంతో ఎంతోమందిని అలరించిన మిచి కోబిన్ అకాల మరణం గురించి తెలుసుకున్నందుకు చాలా బాధపడ్డాను. సింగర్ గానే కాకుండా ఎన్న అద్భుతమైన పాటలకు రచించి పాడి అందరి మనసు గెలుచుకున్న యువ గాయకుడు మిచి కోబిన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్విట్ చేశారు.
Shattered to learn the sad and untimely demise of Michi Kobin, one of the finest young singers and song writers of Arunachal Pradesh, and lead vocalist of AR01 band
Dear Kobin, you have left us in extreme agony but your talent and legacy will ever be etched in our memory. Rest… pic.twitter.com/QkSSstrOXP
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) August 14, 2023