సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రిలీజ్ అయ్యిందంటే థియేటర్ల వద్ద సంబరాలు మామూలుగా ఉండవు. డ్యాన్సులు, కటౌల్స్ కి పాలాభిషేకాలు.. డప్పు చప్పుళ్లతో థియేటర్ పరిసరాలు మారుమోగుతాయి..
సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా పరిచయం అక్కరలేదు. భారత దేశంలోనే కాదు.. సింగపూర్, చైనా, మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో సూపర్ రజినీకాంత్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా ఆ దేశాల్లో తప్పకుండా రిలీజ్ అవుతుంది. వెండితెరపై తన స్టైలిష్ నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు తళైవా.. 60 పదులు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా ఆయన నటిస్తున్నారు. ఆయన నటించిన ‘జైలర్’ మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ మూవీ చూడటానికి కొన్ని కార్పోరేట్ కంపెనీలు సెలవు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తమ అభిమాన నటుడిని చూడటానికి ఏకంగా విదేశాల నుంచి కూడా అభిమానులు తరలివస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
సినిమా హీరోలు అంటే ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉంటారు. అభిమానానికి భాషా, ప్రాంతం లాంటివి ఏదీ అవసరం లేదు అంటారు. అది అక్షరాల రుజువైంది.. ఈ రోజు సూపర్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తమ అభిమాన హీరోను చూడటానికి థియేటర్ల వద్ద క్యూలు కట్టారు.. పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారుర అభిమానులు. ఇదంతా ఒక ఎత్తైతే తాము ఎంతగానో ఇష్టపడే అభిమాన హీరో రజినీకాంత్ మూవీ చూడటానికి జపాన్ కి చెందిన ఓ జంట ఏకంగా చెన్నైకి వచ్చారు. జపాన్ లోని ఒసాకాకు చెందిన యసుదా హిడెతోషి తన భార్య తో కలిసి ప్రత్యేకంగా ‘జైలర్’ మూవీ చూడటానికి చెన్నైకి వచ్చారు. గురువారం ఉదయం చెన్నైలోని థియేటర్లో రజినీ అభిమానులతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ సందర్బంగా యసుదా హిడెతోషి మాట్లాడుతూ.. ‘రజినీకాంత్ అంటే మాకు ఎంతో ఇష్టం.. థియేటర్లో ఆయన స్టైల్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తాం. మా ఫ్యామిలీలో అందరికీ రజినీకాంత్ అంటే తెగ ఇష్టపడతారు. ఈ రోజు రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ మూవీ రిలీజ్ సందర్భంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి జపాన్ నుంచి చెన్నైకి వచ్చాం.. థియేటర్లో రజినీకాంత్ అభిమానులతో చూస్తుంటే మంచి జోష్ వచ్చింది.. నేను నా భార్య మూవీ చూసి చాలా ఎంజాయ్ చేశాం’ అని అన్నాడు. ప్రస్తుతం యసుదా హిడెతోషి జపాన్ లో ఫ్యాన్ క్లబ్ లీడర్ గా కొనసాగుతున్నారు. యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ‘జైలర్’ మూవీలో రజినీకాంత్, తమన్నా, రమ్యకృష్ణన్, జాకీష్రాఫ్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, సునీల్, యోగిబాబు తదితరులు నటించారు.
VIDEO | A Japanese couple has travelled from Osaka to Chennai, Tamil Nadu to watch Rajinikanth’s new film ‘Jailer’.
“To see the Jailer movie, we have come from Japan to Chennai,” says Yasuda Hidetoshi, Rajinikanth fan club leader, Japan. pic.twitter.com/04ACrc4Q5c
— Press Trust of India (@PTI_News) August 10, 2023