'పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!' ఈ సుమతీ శతకాన్ని 100 సార్లు చదివి.. పైచదువులకు వచ్చిన మనం.. తండ్రికి సంతోషం కలిగించామో లేదో తెలియదు కానీ, మన దేశానికి చెందిన ఒక అమ్మాయి తన తండ్రికి అంతకుమించిన సంతోషాన్ని కలిగించింది. ఫైటర్ ఫైలెట్ కావాలన్న తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా.. తండ్రితో కలిసి యుద్ధవిమానాన్ని నడిపిన కూతురిగా అందరి మన్ననలు పొందుతోంది. మే 30వ తేదీన కర్ణాటక బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతుళ్లు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇద్దరు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ మిషన్ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి అని వాయుసేన వెల్లడించింది. Father-daughter duo, Flying Officer Ananya & Air Commodore Sanjay Sharma,created history on May 30 when they flew in same formation of Hawk-132 aircraft at IAF Station Bidar,where Flying Officer Ananya is undergoing her training before she graduates onto superior fighter aircraft pic.twitter.com/dUW4zCmc9V — ANI (@ANI) July 5, 2022 ఇది కూడా చదవండి: Gay Marriage: అంగరంగ వైభవంగా ఇద్దరి మగాళ్ల పెళ్లి.. వైరల్ అవుతున్న ఫొటోలు! అనన్య తండ్రి సంజయ్ శర్మ 1986లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అనన్య కూడా చిన్ననాటి నుంచి తన తండ్రినే స్ఫూర్తిగా తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేసిన అనన్యకు సైన్యంలో చేరి, యుద్ధ విమానాలను నడపాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె తండ్రి సంజయ్ శర్మ ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మనో ధైర్యాన్ని కూడా నూరిపోసేవారు. 2016లో భారత వైమానిక దళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ బ్యాచ్ లో స్థానం సంపాదించిన అనన్య.. ఆ తర్వాత ఫ్లైయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎంపికైంది. అనుభవజ్ఞులైన పైలట్ల పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొంది కిందటేడాది డిసెంబర్ లో ఫైటర్ పైలట్ గా నియామకం పొందింది. అనన్య ప్రస్తుతం బీదర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతోంది. ఈ వార్త విన్న పలువురు నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. #fatherdaughter duo created #history on 30 May 2022 Flew in same formation of Hawk-132 ✈ at #AirForce Stn Bidar, where Flying Officer Ananya Sharma is undergoing training before graduating onto faster & more superior fighter aircraft of @IAF_MCC@TwitterIndia @AviationWeek pic.twitter.com/72LyWRZFpo — PRO Defence Gujarat (@DefencePRO_Guj) July 5, 2022