ప్రేమ గురించి.. దాని గొప్పతనం గురించి ఇప్పటికే చాలా మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు.. ఎన్నో పుస్తకాలు రాశారు. ఇక చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు ఎన్నో. అయితే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన.. ప్రతి సారి ప్రేమకు కొత్త నిర్వచనం పుట్టుకొస్తునే ఉంటుంది. ప్రేమించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. కొందరు ప్రేమించిన వాళ్లను మర్చిపోకుండా ఉండేందుకు.. వారి పేరు మీద అరుదైన కట్టడాలు నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. మరి కొందరు జీవితాలనే త్యాగం చేశారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ ఓ వృద్ధ డాక్టర్.. భార్య మీద అమితమైన ప్రేమతో.. 21 ఏళ్లుగా ఆమె శవంతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. వినడానికే భయంకరంగా ఉన్నప్పటికి ఇది వాస్తవం. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: చనిపోయిందనుకున్న మహిళ శవపేటికలోంచి లేచొచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారు బ్యాంగ్ ఖేన్ ప్రాంతానికి చెందిన విశ్రాంత డాక్టర్ చాన్ జన్వాచకల్ 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం చేస్తున్నాడు. ఇన్నేళ్ల కాలంలో ఆయన ప్రతి రోజూ శవపేటిక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేవాడు. అయితే వయసు మీద పడటంతో.. గత కొంత కాలం నుంచి చాన్ ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. దీంతో భార్య మృతదేహాన్ని ఇంకా భద్రపర్చలేననే బెంగతో చివరికి 21 ఏళ్ల తర్వాత భార్య డెడ్‌బాడీకి అంత్యక్రియలు నిర్వహించాడు చాన్. దాంతో ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ క్రమంలో బ్యాంకాక్ మీడియా ఆయన గురించి ఆరా తీయగా.. ఆసక్తకిర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
చాన్ చేసిన పని సంచలనంగా మారడంతో.. పలు మీడియా సంస్థలు ఆయనను ఇంటర్వ్యూ చేశాయి. ఈ క్రమంలో చాన్ ఒక డాక్టర్ అని, ఆర్మీలోనూ పనిచేశాడని వెల్లడైన తర్వాత జనాల ఆశ్చర్యం మరింత పెరిగింది. మెడిసన్ తోపాటు ఇతర కోర్సులూ చేసిన చాన్ ఇప్పటికీ చాలా సబ్జెక్టులపై అవగాహన ఉన్నట్లు తెలిసింది. చాన్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేయడానికి ముందు యూనివర్సిటీలో అధ్యాపకుడిగానూ పనిచేశారు. ఆయన భార్య థాయిలాండ్ ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. ఇద్దరిదీ మెడికల్ ఫీల్డ్ కావడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇలా ఉండగా.. 21 ఏళ్ల కిందట భార్య చనిపోయిన సందర్బంలో కొడుకులు తల్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా చాన్ వద్దని వారించాడు. ఆమెను వదలి ఉండలేనని, తమది శాశ్వతమైన ప్రేమ అని వాదించాడు. శవాన్ని తీసుకొని ఫామ్ హౌజ్ కు వెళ్లి అక్కడే కొత్తజీవితం మొదలుపెట్టాడు. తండ్రి చేసే పనులకు విసిగిపోయిన పిల్లలు.. ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Rare Planet Alignment: అంతరిక్షంలో అద్భుతం.. మళ్లీ 1000 ఏళ్ల తర్వాతే ఇలా జరుగుతుందట!
ఇన్నాళ్లూ తన శక్తికొద్దీ భార్య మృతదేహాన్ని కాపాడుకుంటూ వచ్చానని, 72 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణిస్తోన్న దశలో ఇక ఆ పని చేయలేనేమోననే బెంగతో చివరికి భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు. స్థానిక మతాచారం ప్రకారం భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న చాన్ ఫొటోలు వైరలయ్యాయి. చాన్ భద్రపర్చుకున్న భార్య శవపేటికలో నల్లటి ఎముకల గూడు మాత్రమే మిగిలుంది. దాన్ని జాగ్రత్తగా వస్త్రంలో చుట్టి, అంత్యక్రియలు నిర్వహించారు ఫెట్ కాసెమ్ బ్యాంకాక్ ఫౌండేషన్ వారు. అంత్యక్రియల అనంతరం ఇన్నాళ్లు.. భార్య శవంతో కలిసి జీవించానని.. ఇకపై ఆమె అస్థికలతో కలిసి ఉంటానంటూ.. చాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. కారణం ఏంటంటే?..