పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. ఆ పుత్రుడు పుట్టే దాకా ఎన్నో యాగాలు కూడా చేస్తారు. దేశం మారినా.. పిల్లల విషయంలో తల్లిదండ్రుల మొదటి ప్రాధాన్యత కుమారుడే. కానీ, ఈ దంపతులు మాత్రం అలా పుట్టిన కుమారుడునే అమ్మేశారు. ఆ పిల్లాడి టైమ్ అస్సలు బాలేదు పాపం.. కొనుకున్న తల్లిదండ్రులు ఆ తర్వాత ప్రమాదంలో చనిపోయారు. అంతే ఒక్కసారిగా అనాథ అయిపోయాడు. పూట గడుపుకోవడానికి బంధువుల ఇళ్ల చుట్టూ తిరిగే వాడు. ఆ క్రమంలో తనకు వేరే తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకున్నాడు. వారిని వెతుక్కుంటూ వెళ్లిన అతనికి షాకింగ్ న్యూస్ తెలిసింది.
చైనాలోని హెబీ ప్రావిన్స్ లో 17 ఏళ్ల లియు జుజౌ నివాసం ఉంటున్నాడు. అతడిని పుట్టగానే తల్లిదండ్రులు వేరే వాళ్లకు అమ్మేశారు. అతడిని విధి వెక్కిరించింది. నాలుగేళ్ల తర్వాత పెంపుడు తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారు. అతను ఒక్కసారిగా అనాథ అయిపోయాడు. బంధువుల ఇళ్లలో పూట గడుపుకుంటూ ఏళ్లు వెల్లదీశాడు. తనకంటూ కన్నతల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకున్నాడు. సోషల్ మీడియా సాయంతో తండ్రి చిరునామా సంపాదించాడు. ఎంతో ఆశగా వెళ్లిని లియుకు భంగపాటే ఎదురైంది. అసలు నువ్వు నా కొడుకువే కాదంటూ తండ్రి పొమ్మన్నాడు. పోలీసుల సాయంతో డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించి తన తండ్రే అని నిరూపించుకున్నాడు.
అయినా అతనికి మరో షాకింగ్ విషయం తెలిసింది. అక్కడ తన తల్లి లేదని.. అసలు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉండటం లేదని తెలుసుకున్నాడు. వాళ్లిద్దరు విడిపోయవడానికే లియు జుజౌని అమ్మేశారని తెలుసుకుని షాకయ్యాడు. లియుని అమ్మగా వచ్చిన సొమ్ముని ఇద్దరూ పంచుకుని విడిపోయారు. వెతుక్కుంటూ వచ్చిన కుమారుడిని తల్లి ఆప్యాయంగా హత్తుకుంది. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. కానీ, కొడుకు డిమాండ్ విని నిర్ఘాంతపోయింది. తనకంటూ ఓ ఇల్లు కట్టించాలని లియు ఆమెను కోరాడు అందుకు తల్లి ససేమిరా అంది. తల్లిదండ్రులను ఓచోట చేర్చి పంచాయితీ పెట్టాడు. నా పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. చదువు కోసం, బతికేందుకు కొంత డబ్బు ఇస్తానని తండ్రి ఒప్పుకున్నాడు.
తన పెంపుడు తల్లిదండ్రుల ఇల్లు శిథిలావస్థలో ఉందని.. దానిని బాగుచేయించి ఇవ్వండని లియు కోరాడు. అసలు ‘నన్ను ఎందుకు అమ్మేశారు’ అని తల్లిదండ్రులపై న్యాయపోరాటం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులపై కోర్టులో దావా వేశాడు. కచ్చితంగా ఈ కేసులో తాను విజయం సాధిస్తానంటూ లియు విశ్వాసం వ్యక్తం చేశాడు. లియు పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.