ఆన్‌లైన్‌లో ఫ్లాష్ సేల్స్‌తో ఈ–కామర్స్ కంపెనీల హడావిడి భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, సేవను అందించడంలో విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్ కంపెనీదే. వినియోగదారుల రక్షణ (ఈ– కామర్స్) నిబంధనలకు సవరణలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) సోమవారం సూచించింది. ఈ కామర్స్ ఫ్లాష్ సేల్స్ పై నిషేధం విధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆన్‌లైన్ సైట్ల మిస్ సెల్లింగ్‌కూ చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఇకపై నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్ పై నిషేధం విధించాలని నిర్ణయించింది.
తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేసేందుకు ఈ–కామర్స్ కంపెనీలు, పారిశ్రామిక సంఘాలకు జూలై 6 వరకు ఎంసీఏ సమయం ఇచ్చింది. కొందరు విక్రేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ కంపెనీలపై కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతున్న తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ–కామర్స్ కంపెనీల్లో జవాబుదారీ పెరుగుతుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. దేశంలో ఇకామర్స్ సంస్థలు అందించే వస్తు, సేవల ‘ఫ్లాష్ సేల్’పై నిషేధం విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ సంస్థలు పరిమిత కాలంలో తక్కువ రేట్లతో ఫ్లాష్ సేల్‌ను అందిస్తున్న విధానాన్ని నియంత్రించాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థలపై మళ్లీ దర్యాప్తును వేగవంతం చేసింది.