రాత్రిపూట రైలు ప్రయాణం చేసే వారు ఖచ్చితంగా కొన్ని నిబంధనలను తెలుసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ మీద చర్యలు తప్పవు. మరి ఆ నిబంధనలు ఏమిటో తెలుసుకోండి.
నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అద్దెకు ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం. అందులోనూ బ్యాచిలర్స్ అయితే వాళ్ల కష్టాలను మాటల్లో వర్ణించలేం. ఒకవేళ వారికి రూమ్ దొరికినా కూడా వారి బాధలు బాధలు కాదు. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి రూల్స్ అన్నీ వాళ్లకే పెడతారు.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో పెద్ద అల్లర్లు, హింసాకాండలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసే సమయంలో వారికి రాజకీయంగా కొంతమంది మద్దతు ఇస్తుంటారు.. ఆ సమయాల్లోనే యూనివర్సిటీల్లో గొడవలు, హింసాత్మాక ఘటనలు జరుగుతున్నాయి.
ట్విట్టర్.. దీనిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అనేకంటే ప్రచార సాధనం అనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ని తమ అభిప్రాయాలను వెల్లడించడానికే కాదు.. సమాచారాన్ని చేరవేయడానకి కూడా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు, రాజకీయనేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌ఫ్లూఎన్సర్స్, సెలబ్రిటీలు ఇలా ఎందరో ఈ ట్విట్టర్‌ని ఉపయోగించి తమ అభిమానులు, ఫాలోవర్లు, ప్రజలను చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్విట్టర్ కొత్త రూల్స్ ని తీసుకురాబోతోంది. ఈ రూల్స్ అన్నింటిని పక్కనబెడితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఒకటి ఉంది. […]
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీకి ఇంకా కొద్దిరోజులే గడువు ఉంది. ఫిబ్రవరి 26న అట్టహాసంగా బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ తెలుగు అంటే ఇప్పటి వరకు 5 సీజన్లు చూశారు కాబట్టి.. ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది. 24 గంటల్లో జరిగిన అన్ని విషయాల నుంచి ఆసక్తికర అంశాలను జోడిస్తూ రోజుకు గంట ఎపిసోడ్ ప్రసారం చేసేవారు. కానీ, 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ జరుగుతూ ఉంటే […]
ఆర్బీఐ కొత్త రూల్.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ యూజర్ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడం కుదరదు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ప్యాకేజీ రెన్యువల్ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం ఇక మీదట అలా కుదరదు. ఆటోమేటిక్‌గా పేమెంట్ డిడక్ట్ అయ్యే సమయంలో మోసాలకు, […]
వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతల కార్యక్రమాలకు కరోనావైరస్ నిబంధనలు అడ్డురానప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రం కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు ఎలా వర్తింపజేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సంస్మరణ సభకు కరోనా లేదు కానీ విపక్షాలు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాలు చేస్తే కరోనా కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ […]
క్వారెంటైన్ రూల్స్ ను ఉల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై – హోచి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారెంటైన్ నిబంధలను ఉల్లంఘించి బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల […]
బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ రెంటల్ ఛార్జీ పెరిగింది. ఇన్నాళ్లూ బ్యాంక్ లాకర్ల విషయంలో బ్యాంకులు తమ ఇష్టానికి పనిచేసేవి. తమ సొంత నియమావళితో బ్యాంకులు ముందుకు వెళ్ళేవి. అయితే, లాకర్ల విధానాన్ని పారదర్శకం చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకులకు ఈ విధానాన్ని అమలు చేయాలంటూ సూచించింది. ఈ రూల్స్ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకు లాకర్ సర్వీసుల […]
వాహనాలు, రోడ్లు, ఇతరత్రా కారణాల వల్ల నిత్యం గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనవి. పీఎం 2.5 కంటికి కనిపించదు. తల వెంట్రుక మందం(50 మైక్రోగ్రాములు)లో 20వ వంతు ఉంటుంది. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపధ్యంలో వాహన కాలుష్యం పరిమితిలోనే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (పీయూసీ) వాహనాలకి ఉండాలనే సంగతి తెలిసిందే. కాలుష్య పరీక్ష జాప్యం […]