నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అద్దెకు ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం. అందులోనూ బ్యాచిలర్స్ అయితే వాళ్ల కష్టాలను మాటల్లో వర్ణించలేం. ఒకవేళ వారికి రూమ్ దొరికినా కూడా వారి బాధలు బాధలు కాదు. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి రూల్స్ అన్నీ వాళ్లకే పెడతారు.
సాధారణంగా యువతకు కష్టమైన పని ఏది అంటే.. అందరూ చదువుకోవడం, జాబ్ కొట్టడం అని చెబుతుంటారు. అయితే ఇక్కడ వారి లైఫ్ లో అంతకన్నా కష్టమైన పని ఇంకొకటి ఉంది. ఆ ఘటాన్ని దాదాపుగా పెళ్లైన ఎంతోమంది కుర్రకారు దాటే ఉంటారు. అదేంటంటే.. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు అద్దెకు ఇల్లు సంపాదించడం. అవును.. ఈ టాస్క్ ముందు జాబ్ కొట్టడం అయినా తేలికనే చెప్పాలి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే అద్దెకు ఇల్లు పొందడం అనేది మహా కష్టమైన విషయం. బ్యాచిలర్స్ అంటే ముఖం మీదే డోర్ క్లోజ్ చేస్తారు. అయితే తాజాగా బ్యాచిలర్స్ రూమ్ కండిషన్స్ అని ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
మాములుగా బ్యాచిలర్స్ కి చాలా మంది రూమ్ ఇచ్చేందుకు వెనుకాడుతూ ఉంటారు. కొందరు ఇచ్చినా కూడా కాస్త కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అందరూ బ్యాచిలర్స్ వల్ల ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ, వస్తాయేమో అనే ఒకే ఒక అనుమానం ఇన్ని ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు బెంగళూరులో ఓ హౌసింగ్ సొసైటీ పెట్టిన ఒక కండిషన్స్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఉన్న కండిషన్స్ చూసి బ్యాచిలర్స్ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటున్నారు. ఇంటికి రాత్రి అతిథులు రాకూడదు.. బాల్కనీలో ఫోన్లు మాట్లాడకూడదు. రాత్రిపూట రూమ్ లో వేరే వాళ్లు స్టేచేయడానికి వీల్లేదు అంటూ చాలానే చెప్పుకొచ్చారు.
ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే.. ముఖ్యంగా రాత్రి 10 తర్వాత మీ రూమ్ కి ఎవరూ రాకూడదు. ఒకవేళ ఎవరైనా గెస్టులు మీకోసం వస్తే వాళ్లు రాత్రి 10 గంటలకంటే ముందే వెళ్లిపోవాలి. ఒకవేళ ఎవరైనా అతిథులు రాత్రి స్టే చేయాలి అంటే మీరు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఆ గెస్ట్ ఐడీ ప్రూఫ్ ని కూడా సమర్పించాలి. వారి వివరాలను కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాత్రి తర్వాత కారిడార్, బాల్కనీలో ఉండి ఫోన్లు మాట్లాడకూడదు. రాత్రిపూట పార్టీలు చేసుకోకూడదు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ మ్యూజిక్ పెట్టకూడదు. అంటూ చాలా రూల్స్ పెట్టారు. అలాగే పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా రూల్స్ ని అతిక్రమిస్తే వారికి రూ.1000 జరిమానా కూడా విధిస్తారు. లేదా రూమ్ ఖాళీచేయిస్తారు. వైరల్ అవుతున్న ఈ రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.