సెట్స్ లో చెడు ప్రవర్తన కారణంగా ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం పడింది. గతంలో పలు వివాదాలకు కారణమైన వీళ్లని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది?
ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే స్టార్ హీరోల దగ్గర నుంచి నార్మల్ యాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరూ.. వచ్చామా-యాక్ట్ చేశామా-వెళ్లిపోయామా అన్న రీతిలో ఉంటారు. కొందరు మాత్రం కావాలని వివాదాల జోలికి పోతుంటారు. షూటింగ్ లోనూ లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. టాలీవుడ్ లో చిన్నచిన్నవి జరుగుతుంటాయి తప్పితే పెద్ద పెద్ద గొడవలయ్యేంత సంఘటనలు అయితే ఎప్పుడూ జరగలేదు. తాజాగా సౌత్ లోని ఓ ఇండస్ట్రీలో మాత్రం ఏకంగా ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం విధించారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ ఇండస్ట్రీ పేరు చెప్పగానే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారని ప్రతి ఒక్కరూ అంటారు. చాలా తక్కువ బడ్జెట్ తో సింపుల్ స్టోరీని అంతే బ్యూటీఫుల్ గా తీస్తారనే పేరుంది. ఇప్పుడు దాన్నే చెడగొట్టడానికా అన్నట్లు కొందరు యాక్టర్స్ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు అలా.. షేన్ నిగమ్, శ్రీనాథ్ బసి అనే ఇద్దరిపై.. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ సంఘాలు నిషేధం విధించాయి. భవిష్యత్ లో వీళ్లని సినిమాల్లోకి తీసుకోవద్దంటూ ఆర్డర్స్ జారీ చేశాయి.
‘కుంబలంగీ నైట్స్’ అనే మూవీలో షేన్-శ్రీనాథ్ ఇద్దరూ కలిసి నటించారు. యాక్టర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్, వ్యక్తిగత జీవితాల్లో వీళ్లిద్దరూ వివాదాలకు కారణమవడం ఇదేం కొత్తకాదు. షేన్ నిగమ్.. ‘RDX’మూవీ షూటింగ్ 90 శాతం కంప్లీట్ అయిన తర్వాత బయటకొచ్చేశాడు. మరోవైపు శ్రీనాథ్ బసిని కూడా గతంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరిపై నిషేధం పడటం చర్చనీయాంశంగా మారిపోయింది. మరి సెట్స్ లో ఈ హీరోల ప్రవర్తన, ఫలితంగా నిషేధం పడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.