కరోనా వైరస్ ప్రపంచమంతా విజృంభిస్తున్నా ఆ వైరస్ కలిగించే కోవిడ్-19 వ్యాధి నుంచి శరీరానికి రక్షణనిచ్చే వ్యాక్సిన్ ఏదీ ఇంకా విస్తృత వినియోగం కోసం ఆమోదం పొందలేదు. 2020 ఆగస్టు 11న స్పుత్నిక్ వీ పేరుతో తొలి కోవిడ్-19 వ్యాక్సీన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే సమర్థవంతమైన వ్యాక్సిన్ ను రూపొందించిన ఫైజర్ సంస్థ కరోనా ఔషధం తయారీపై దృష్టి సారించింది. రకరకాల రూపాల్లో మానవాళిపై విరుచుకుపడుతున్న కరోనా కుటుంబానికి చెందిన వైరస్లన్నింటి పని పట్టే ‘‘బాహుబలి’ లాంటి ప్యాన్ కరోనా వైరస్ వ్యాక్సిన్’ ఐడియా అమెరికా శాస్త్రజ్ఞులకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి అలాంటి ఓ ‘యూనివర్సల్ టీకా’ను రూపొందించారుట.
ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ టీకా మంచి ఫలితాలను చూపిందట. ఎలుకలకు ఒక్క కొవిడ్-19 నుంచే కాక, ఇతర కరోనా వైరస్ ల నుంచి కూడా రక్షణ లభించేలా రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసిందట. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరొలినా వర్సిటీ శాస్త్రజ్ఞులు ఈ టీకా తయారీకి శ్రీకారం చుట్టారు. సూపర్ వ్యాక్సిన్ తయారీకోసం శాస్త్రజ్ఞులు సరికొత్త పరిజ్ఞానమైన ఎంఆర్‌ఎన్‌ఏ విధానాన్నే ఆశ్రయించారు.
ఫైజర్, మోడెర్నా టీకాల తయారీకి వాడిన టెక్నాలజీ. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ఉండే సింథటిక్ మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏలు., టీకాలు వేయించుకున్నవారి శరీరాల్లోకి వెళ్లి, కరోనా స్పైక్ ప్రొటీన్‌ను వారి శరీర కణాలే తయారుచేసేలా ప్రేరేపిస్తాయి.
దక్షిణాఫ్రికా వేరియంట్‌పై సైతం ఈ సూపర్‌వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. వచ్చే ఏడాది హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు.