గతంలో పోలిస్తే.. సినీ పరిశ్రమలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరో పెద్ద హీరో అతిథిగా విచ్చేసి.. సినిమా టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అంతేనా మేమంతా బాగున్నాం అని చెప్పేందుకు మల్టీ స్టారర్ మూవీలో నటిస్తూ.. మరికొందరికి ఆదర్శప్రాయంగానూ నిలుస్తున్నారు మన హీరోలు. అందులోనూ యంగ్ జనరేషన్‌లో స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు.
సీనియర్ నటి కాంచన గుర్తుండే ఉంటారు. అందంతో పాటు నటనతోనూ అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అలాంటి ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కాంచన ఏమన్నారంటే..!
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. పుట్టిన రోజు దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ప్రస్తుత కాలంలో తమకు కాబోయే వరుడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం ట్రెండ్ గా మారింది. దాంతో చాలా మంది సెలబ్రిటీలు జీవిత భాగస్వామి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు కాబోయే భర్త ఇతడే […]
దర్శకధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా విపరీతైమన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలో ఏదో ఓ చిన్న పాత్రలో నటించినా చాలని.. ప్రతి ఒక్కరు ఆశపడతారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తారు. రాజమౌళి సినిమాలో అవకాశం లభిస్తే.. కొందరు ఆస్కార్ అవార్డు వచ్చినంత గొప్పగా ఫీలవుతారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆ అవకాశాన్ని జారవిడుచుకోరు. మిగతా సినిమాలు క్యాన్సిల్ చేసుకుని మరి.. జక్కన్న సినిమాలో యాక్ట్ చేస్తారు. అది రాజమౌళి క్రేజ్. అసలు ఆయన సినిమాకు నో చెప్పేవారు ఉంటారంటేనే […]
హాలీవుడ్ సినిమాలు చూసి మన ఆహా ఓహో అనుకోవడమే తప్పించి.. మన సినిమాలని వాళ్లు చూస్తారా? ఒకవేళ చూసినా సరే ఆదరిస్తారా అనే సందేహాలు చాలా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో ట్రెండ్ మారిపోయింది. తెలుగు సినిమా.. ప్రపంచ గర్వించే స్థాయికి చేరింది. ఇంకా చెప్పాలంటే రాజమౌళి అనే ఓ సాధారణ దర్శకుడు.. తెలుగు సినిమా స్థాయిని ఎవరికీ అందనంత ఎత్తులో పెట్టాడు. దీంతో టాలీవుడ్ గౌరవం పెరిగింది. ఏకంగా ఫారెనర్స్.. మన సినిమా చూస్తూ థియేటర్లలో […]
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్థాయి సినిమా తీయడం.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా తేలికగా భావిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీ అనే ప్రస్తావన వస్తే.. ముందుగా దర్శక ధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీనే అందరికి గుర్తొస్తుంది. ఎందుకంటే.. చారిత్రక కథా నేపథ్యంలో తెరకెక్కిన బాహుబలి చూశాకే సినీ ఫ్యాన్స్ అంతా అసలు రాజుల కథలు, కోటలు, రాజభవనాలు, యువరాణులు, మహారాణి.. రాజ్యాలు, దండయాత్రలు, రాజతంత్రాలు, నాటి ఆటపాటలు తెరపై […]
ఒకప్పుడు దక్షిణాది సినిమాలు అంటే చిన్నచూపు చూసేవారు, అప్పట్లో అలా ఉండేది కూడా. దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి వల్ల ఆ మార్క్ చెరిగిపోయింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ కూడా మారింది. భారీ బడ్జెట్ తో యాక్షన్, పీరియాడికల్ మూవీస్ తీశారు, తీస్తున్నారు. అలా వచ్చిన వాటిలో త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు..బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఇప్పుడు అలా బాక్సాఫీస్ వండర్ క్రియేట్ చేసేందుకు వస్తున్న సినిమా పొన్నియన్ […]
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి. ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన విజువల్ వండర్ మూవీ బాహుబలి. ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా, పాన్ వరల్డ్ స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఈ బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు భాష సరిహద్దులని చెరిపేస్తూ భారతీయ సినిమాగా అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నాయి. ఈ సినిమాలు […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. డెబ్యూ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ టైమ్ ట్రావెలింగ్ మూవీ ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్నటువంటి పాత్రలలో కనిపించనుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో బింబిసారుడిగా పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ అందరి […]
భారీ అంచనాల మధ్య విడుదలైన RRR చిత్రం రికార్డులన్నింటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. అందరూ ఊహించినట్లే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో 102 కోట్లకు పైగా వసూలు చేసింది. ఐదు రోజుల కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక 12వ రోజు కూడా అదే జోరుతో ముందుకు వెళ్తూ.. నయా రికార్డ్ క్రియేట్ చేసింది. నైజాంలో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. […]