గతంలో పోలిస్తే.. సినీ పరిశ్రమలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరో పెద్ద హీరో అతిథిగా విచ్చేసి.. సినిమా టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అంతేనా మేమంతా బాగున్నాం అని చెప్పేందుకు మల్టీ స్టారర్ మూవీలో నటిస్తూ.. మరికొందరికి ఆదర్శప్రాయంగానూ నిలుస్తున్నారు మన హీరోలు. అందులోనూ యంగ్ జనరేషన్‌లో స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు.
‘ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప’ అంటూ అభిమానులు తన్నుకుంటారు కానీ. సినిమా పరిశ్రమలో అందరూ కలిసి మెలిసే ఉంటారు. గతంలో పోలిస్తే.. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఉంటున్నారు. ఏదైనా ఫంక్షన్‌లో కనిపిస్తే ఆప్యాయతగా పలకరించుకుంటున్నారు. ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరో పెద్ద హీరో అతిథిగా విచ్చేసి.. సినిమా టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అంతేనా మేమంతా బాగున్నాం అని చెప్పేందుకు మల్టీ స్టారర్ మూవీలో నటిస్తూ.. మరికొందరికి ఆదర్శప్రాయంగానూ నిలుస్తున్నారు మన హీరోలు. అందులోనూ యంగ్ జనరేషన్‌లో స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు. రామ్ చరణ్, రానా, ప్రభాస్, జూ ఎన్టీఆర్, గోపిచంద్, నాగ చైతన్య, అల్లు అర్జున్, నితిన్, నిఖిల్, సిద్దు, అడవి శేష్, విజయ్ దేవరకొండ వీరంతా వీలు చిక్కినప్పుడల్లా పక్క హీరోలను పొగుడుతూ టాలీవుడ్‌లో మంచి వాతావరణాన్ని సృష్టించారు. దీంతో ఫ్యాన్స్‌లో ఇగోయిజం అని తగ్గిందనే చెప్పొచ్చు.
వీరిలో బాహుబలితో మంచి ఫ్రెండ్స్ అయ్యారు ప్రభాస్, రానా. ఇప్పుడు తన స్నేహితుడి గురించి గొప్పగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఇంతకు ఆయన ప్రభాస్‌ను ఉద్దేశించి అంతలా రానా ఏం పొగిడారంటే. తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పడుకునే నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా సదరన్ సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ‘‘మేం అందరం అన్నీ సినిమాలను ఎంకరేజ్ చేసుకుంటాం. సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్ట్స్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమా కోసం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి వారు నటించారు. ఈ సినిమా బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను. కచ్చితంగా సినిమా ఇప్పటి వరకు ఉన్న హద్దులను చెరిపేసి కొత్త హద్దులను క్రియేట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం. తెలుగు నుండి గ్లోబల్ ఫిల్మ్ కాబోతుంది’’ అన్నారు.
కాగా, ప్రస్తుతం రానా పరేషాన్ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషనల్లో కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది తన బాబాయితో కలిసి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి విదితమే. ఈ సిరీస్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌గా పేరు వచ్చింది. అలాగే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఈ జూన్‌లో ఆది పురుష్ విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ మూవీ రానుంది. ఆ తర్వాతనే ‘ప్రాజెక్ట్ K’ రానుంది. ఈ చిత్రం జనవరి 12న భారీ రేంజ్‌లో రిలీజ్ కానుంది. అది కూడా పాన్ ఇండియా మూవీగా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనూ రిలీజ్ చేయబోతున్నారట. సీనియర్ నిర్మాత సి.అశ్వినీదత్ ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రూ.500 కోట్లకు పైగానే ఖర్చు పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.