కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు..మొక్కులను తీర్చే భగవంతుడు.శ్రీనివాసుని పావన నిలయం తిరుమల. ప్రపంచం లో అత్యధికంగా భక్తులు దర్శించే క్షేత్రంగా నిలిచింది .ఈ క్షేత్రం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నూతన విధానాలను అనుసరిస్తుంది.అందులో భాగంగా త్వరలో తిరుమలలో డిఆర్‌డిఓ యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ బోర్డు తిరుమలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి రంగంలోకి దిగింది.
ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెడీ చేస్తోంది.ఇందులో భాగంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని తిరుమల కొండ పైన ఉపయోగించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దేశంలో మొట్టమొదటి ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిలువనుంది.
జమ్మూలో ఉగ్రదాద డ్రోన్ల దాడుల తర్వాత యాంటీ డ్రోన్ సిస్టం తయారీలో డీఆర్డీవో జూన్లో జమ్మూలోని ఒక వైమానిక దళంపై ఉగ్రవాద దాడి తరువాత, డిఆర్డిఓ తన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థను కర్ణాటకలోని కోలార్ వద్ద జూలై 6 న ప్రదర్శించింది. తాము తయారు చేసిన మూడు రకాల టెక్నాలజీలను ప్రదర్శించింది.టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటీ వింగ్ చీఫ్, గోపీనాథ్ జట్టి, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు శాఖల ప్రతినిధులతో పాటుగా ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. డిఆర్‌డిఓ యాంటీ డ్రోన్ వ్యవస్థకు డిటెక్షన్, జామింగ్, కౌంటర్‌మెజర్‌లు ఉంటాయి.దీని ధర 22 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
డ్రోన్ వ్యవస్థతో డ్రోన్ల గుర్తింపు ..ధ్వంసం చేసే టెక్నాలజీ కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదకరమైన డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే టెక్నాలజీని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది.డీ ఫోర్ డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీనిద్వారా డ్రోన్ దాడుల ముప్పు నుంచి దేశాన్ని రక్షించుకోవచ్చని తెలుస్తుంది.ఇక ఈ వ్యవస్థ నాలుగు కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదకర డ్రోన్స్ ను గుర్తించే సెన్సార్లు, విధ్వంసం చేసే పరికరాలు ఉంటాయి.గతంలో అనేకమార్లు తిరుమల శ్రీవారి ఆలయం భద్రత విషయంలో వార్తలు వచ్చాయి. గతంలో ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిందని,అప్పట్లో పలువురు ఆందోళన సైతం వ్యక్తం చేశారు.ప్రభుత్వ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నారు.