అబ్బాస్!.. ఈ పేరు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయేవాళ్లు. ఏకంగా ‘అబ్బాస్ కటింగ్’ అంటూ చాలా ఏళ్ల పాటు ట్రెండ్ నడిచింది. హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. హెయిర్ స్టైల్, స్కిన్ కలర్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ కలల రాకుమారుడిగా మారి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. 20 ఏళ్ళ వయసులోనే హీరోగా అడుగుపెట్టి 40 ఏళ్లకే నటనకు గుడ్‌బై చెప్పేశాడు అబ్బాస్. సినిమాలు, మోడలింగ్ మానేసిన అతడు ఎక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి స్పష్టమైన క్లారిటి లేదు. ఇలా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచిన అతడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో దర్శనమిస్తున్నాడు.
కొంతకాలంగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న అబ్బాస్, ఇప్పుడు పూర్తిగా న్యూజిలాండ్ వాసి అయిపోయాడు. కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయిపోయిన అబ్బాస్ అక్కడ మోటివేషనల్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన మోటివేషనల్ స్పీచ్‌తో చాలా మందిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అబ్బాస్. అయితే సినిమా అవకాశాలు తగ్గిపోవడం డిప్రెషన్‌కు లోనైన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్వూలో వెల్లడించాడు. ఇక ఆ తర్వాత అస్ట్రేలియాలో పబ్లిక్ స్పికర్‌గా కోర్స్ తీసుకున్న అతడు యువతకు లైఫ్‌పై స్పీచ్‌లు ఇస్తూ వారిలో స్పూర్తి నింపుతున్నట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్‌కు వెళ్లిన కొత్తలో అతడు పెట్రోల్ బంకులో పని చేసినట్లు గతంలోనే చెప్పాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అడగాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు అబ్బాస్. అక్కడి భారతీయులతో కలిసి కాలం గడపడమే కాకుండా వాళ్లతో ఫోటోలకు కూడా పోజులిస్తున్నాడు. అబ్బాస్.