ఇంట్లో నుండి పని మీద బయటకు వెళుతున్నప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చినా, తుమ్మినా బయటకు వెళ్లరు. అలాగే మంగళవారం ఏ పనులు చేయరు. శుక్రవారం డబ్బులతో పాటు పసుపు, కుంకుమలు ఇవ్వరు. అలాగే అమెరికాలో శుక్రవారం 13 వచ్చిందంటే కీడు జరుగుతుందని భావిస్తుంటారు. ప్రతి మనిషికో వింత నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఇలాగే ఓ ప్రమాదాన్ని ముడిపెట్టి చూస్తున్నారు.
ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇంట్లో నుండి పని మీద బయటకు వెళుతున్నప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చినా, తుమ్మినా బయటకు వెళ్లరు. అలాగే మంగళవారం ఏ పనులు చేయరు. శుక్రవారం డబ్బులతో పాటు పసుపు, కుంకుమలు ఇవ్వరు. అలాగే అమెరికాలో శుక్రవారం 13 వచ్చిందంటే కీడు జరుగుతుందని భావిస్తుంటారు. ఆ రోజు వస్తే ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని భయపడుతుంటారు. ప్రతి మనిషికో వింత నమ్మకాలు ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ సాగిపోతుంటారు. ఇప్పుడు ఇలాగే ఓ ప్రమాదాన్ని ముడిపెట్టి చూస్తున్నారు. అదే శుక్రవారం సాయంత్రం ఏడు, ఎనిమిది గంటల ప్రాంతంలో ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం భారతదేశంలో నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదం ఇదే. కోల్‌కతాకు దక్షిణాన 250 కి.మీ మరియు భువనేశ్వర్‌కు 170 కి.మీ ఉత్తరాన ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం మిస్టరీని తలపిస్తోంది.
బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. 230 మందికి పైగా మరణించారు. దాదాపు 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీటిలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు శుక్రవారం అచ్చిరానట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రైలు ప్రమాదానికి గురైంది. 14 ఏళ్ల క్రితం శుక్రవారం రోజునే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. అసలు ఈ శుక్రవారం ఏం జరిగింది. గత ప్రమాదం ఎప్పుడు జరిగిందో. అసలు ఈ శుక్రవారానికి.. ఈ ప్రమాదానికి సంబంధం ఏంటో చూద్దాం. జూన్, 2023 శుక్రవారం రాత్రి ఏం జరిగిదంటే. సర్ ఎం విశ్వేశ్వరయ్య-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 1,000 మంది ప్రయాణికులతో హౌరా వైపు వస్తుండగా, శుక్రవారం సాయంత్రం బాలాసోర్‌లోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి..భోగీలు మరో రైల్వే ట్రాక్ మీద పడ్డాయి. అంతలో 130 కిలో మీటర్ల వేగంతో దూసుకువస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బలంగా ఢీ కొట్టింది. దీనిలోని 15 భోగీలు బోల్తా పడ్డాయి. ఈ క్రమంలో మరో ట్రాక్ పై దూసుకువస్తున్న గూడ్స్ రైలును ఢీ కొట్టడంతో పెను విషాదం నెలకొంది.
ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌కు ప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదూ. గతంలో కూడా ఈ రైలు ప్రమాదానికి గురై.. పలువురి ప్రాణాలు తీసింది. అది శుక్రవారమే.. 7నుండి 8 గంటల మధ్యలోనే చోటుచేసుకోవడం గమనార్హం. అసలు ఈ రైలు ఎక్కడి నుండి ఎటు వైపు నడుస్తుందంటే..జాతీయ రైల్వే మార్గాల్లో అత్యంత రద్దీ మార్గంలో ఒకటిగా నిలుస్తుంది.. చైన్నై.. హౌరా మార్గం. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12842) చెన్నై- షాలిమార్ (హౌరాలో) మధ్య నడుస్తుంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. దీనికి 2009లో ఈ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. అది కూడా ఒడిశ్సాలోనే కావడం విధి విచిత్రం. 14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13న ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో హౌరా నుండి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని 13 బోగీలు ట్రాక్ మారుతుండగా పట్టాలు తప్పడంతో 16 మంది ప్రయాణికులు మరణించారు. అదీ కూడా శుక్రవారం సాయంత్రం 7.30 నుండి 7.40 మధ్యలోనే చోటుచేసుకోవడం ఆశ్చర్యమేయకమానదు. ఈ ఘటనలో 161 మంది గాయపడ్డారు. పట్టాలు తప్పిన 13 బోగీల్లో 11 స్లీపర్ క్లాస్, రెండు జనరల్ బోగీలు ఉన్నాయి. అప్పట్లో దాన్ని బ్లాక్ ప్రైడేగా పిలిచేవారు. ఇప్పుడు కూడా పెను విషాదాన్ని నింపిందీ కూడా శుక్రవారమే కావడం విచారకరం.