స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద‘. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత సమంత నుండి స్ట్రయిట్ తెలుగులో ఈ సినిమా వచ్చింది. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసిన యశోద.. విడుదలయ్యాక సమంత యాక్షన్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాని దర్శకద్వయం హరీష్ నారాయణ్ – హరి శంకర్ తెరకెక్కించారు. అయితే.. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా టార్గెట్ రీచ్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన యశోద.. ఆ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకుంది. అంతలోనే సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో డ్రాప్ అయిపోయాయి. ఆ తర్వాత థియేటర్స్ లోకి కొత్త సినిమాలు కూడా వచ్చేశాయి. దీంతో కలెక్షన్స్ పరంగా స్లో అయినప్పటికీ, ప్రస్తుతం లాభాల బాటలో ఉందని తెలుస్తోంది. మరోవైపు అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సమంత ఆసుపత్రిలో చేరాక.. యశోద మూవీకి డబ్బింగ్ చెప్పడం.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం సినిమా ఓపెనింగ్స్ బాగా రావడానికి కలిసొచ్చాయని చెప్పవచ్చు. అలాగే మణిశర్మ సంగీతం కూడా యశోదకి ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో యశోద సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యశోద సినిమాలోని కంటెంట్ పై నమ్మకంతో తెలుగు ఒక్కటే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇతర భాషల్లో టాక్ బాగున్నా.. కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని అంటున్నారు. తాజాగా యశోద మూవీ ఓటిటి రిలీజ్ కి సంబంధించి కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా.. థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకే యశోదను ఓటిటిలో రిలీజ్ చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. యశోద మూవీని డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారట. మరి పెద్ద సినిమాలన్నీ కొన్ని వారాల తర్వాతే ఓటిటి రిలీజ్ అవుతాయని అన్నారు. మరి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ.. యశోద విషయంలో ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
#Yashoda Digital Rights With #PrimeVideo@TTSR_Official @vijayavikashm @PrimeVideoIN @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff @adityamusic #SamanthaRuthPrabhu #AmazonPrime #ott #Thunivu #ttsr#VIJAYAVIKASHM pic.twitter.com/5ZlxHDc69B
— Tamil TV Satellites Rights (@TTSR_Official) November 20, 2022