Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ – యువదర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘విక్రమ్’. ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత కమల్ హాసన్ నుండి విక్రమ్ మూవీ వచ్చింది. వచ్చీ రావడంతోనే కమల్ కి ది బెస్ట్ కంబ్యాక్ హిట్ ఇవ్వడమేగాక.. ఆయన కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సెట్ చేసింది.
ఇక ఉత్తమ నటులుగా నేషనల్ అవార్డులు అందుకున్న విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లతో పాటు స్టార్ హీరో సూర్య ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మాస్ ఎంట్రీ ఇచ్చేసరికి.. విక్రమ్ మూవీ విడుదలైన అన్ని భాషల్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టుకుంది. ముఖ్యంగా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద 2017లో బాహుబలి-2 సెట్ చేసిన రూ. 152 కోట్ల ఆల్ టైమ్ గ్రాస్ ని విక్రమ్ మూవీ క్రాస్ చేయడం విశేషం. ఇప్పుడు తమిళనాడు ఇండస్ట్రీ హిట్ గా విక్రమ్ అవతరించిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇన్నేళ్ల తర్వాత ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో పడేసరికి.. కమల్ హాసన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విక్రమ్ బ్లాక్ బస్టర్ సందర్భంగా.. చిత్రయూనిట్ అందరికీ ఖరీదైన బహుమతులు ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ మాంచి విందు భోజనం పెట్టించారు. అయితే.. ప్రస్తుతం విక్రమ్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే విక్రమ్ మూవీ ఓటిటి రిలీజ్.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాల వరకూ థియేట్రికల్ రిలీజైన కొద్దిరోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో విక్రమ్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఖరారైంది. తాజా సమాచారం ప్రకారం.. ‘విక్రమ్’ మూవీ జూలై 8 నుండి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరి విక్రమ్ సినిమా ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.