కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ మీద నార్కోటిక్స్ అధికారులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని కొరుక్కుపేటై ప్రాంతానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త, విజయ్ మరియు ‘లియో’ మూవీ టీం మీద నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద కేస్ నమోదు చేయాలంటూ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు.
కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ మీద నార్కోటిక్స్ అధికారులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని కొరుక్కుపేటై ప్రాంతానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త, విజయ్ మరియు ‘లియో’ మూవీ టీం మీద నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద కేస్ నమోదు చేయాలంటూ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. విజయ్ తనకు ‘మాస్టర్’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు.
విజయ్, అనిరుధ్ కలిసి పాడిన ‘నా రెడీ’ పాట సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. దళపతి మేనరిజమ్స్, మూమెంట్స్‌తో పాటు అనిరుధ్ మార్క్ కలగలసిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలవడంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కట్ చేస్తే, ఈ పాట మూలంగా ‘లియో’ టీం చిక్కుల్లో పడింది. లిరికల్ వీడియోలో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదాస్పదమైంది. మత్తు పదార్థాల వాడకంతో పాటు రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ ఓ వ్యక్తి, విజయ్ అలాగే చిత్రబృందం మీద నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలంటూ ఆన్లైన్లో కంప్లైంట్ చేశాడు. దీని గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారోనని విజయ్ అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘మాస్టర్’ తర్వాత వీరి కాంబో రిపీట్ కావడం, ‘విక్రమ్’తో LCU తెరపైకి రావడంతో సినీ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షుకుల్లోనూ ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇకపోతే విజయ్ ఇటీవల తమిళనాడులో 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను కలిశాడు. దాదాపు 10 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించారు. ఓ విద్యార్థినికి విలువైన వజ్రాల నెక్లెస్ కానుకగా ఇచ్చారు. డబ్బు తీుసుకోకుండా ఓటెయ్యాలని కోరుతూ, ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పాలని పిలుపునిచ్చారు. అలాంటి విజయ్ సినిమాల్లో సిగరెట్ తాగడం ఏం బాగోలేదంటూ ఓ వ్యక్తి కేస్ పెట్టాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ‘లియో’ ను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఫస్ట్‌లుక్‌తో పాటు ‘నా రెడీ’ పాటలోనూ దానికి సంబంధించిన రిఫరెన్సులు కనిపించాయంటున్నారు. అక్టోబర్ 19న తమిళ్, తెలుగు భాషల్లో ‘లియో’ భారీ స్థాయిలో విడుదల కానుంది.