విశ్వ నటుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున నలుగురు కలిసి ఉన్న ఓ రేర్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో వీరు కలిసిన సందర్భం ఏంటి?, ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అంటూ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు.
సెలబ్రిటీల మూవీస్, రేర్ పిక్స్, వీడియోస్ వంటి విషయాలు వారి అభిమానులతో పాటు ప్రేక్షకులనూ అలరిస్తుంటాయి. స్క్రీన్ మీద మిస్ అయిన స్టార్స్ కాంబినేషన్ సినిమా ఫంక్షన్లలో, ప్రైవేట్ పార్టీస్‌లో చూడొచ్చు. అప్పటి వారి అరుదైన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తుంటాయి. అలా విశ్వ నటుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున నలుగురు కలిసి ఉన్న ఓ రేర్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో వీరు కలిసిన సందర్భం ఏంటి?, ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అంటూ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. కమల్ హాసన్ అప్పటికే తెలుగు, తమిళంలో బిగ్ స్టార్. ఇక మెగాస్టార్ గురించి తెలిసిందే. బాలయ్య, నాగ్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుని స్టార్లుగా కెరీర్ కంటిన్యూ చేస్తున్న రోజులవి.
ఎవరికి వారు తమ సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉండేవారు. అలాంటిది వీలు చూసుకుని నలుగురూ ఒకే వేదికపైకొచ్చారు. ఇది దాదాపు 36 సంవత్సరాల నాటి ఫోటో. అయితే వీరు కలిసిన అకేషన్ ఏంటో తెలుసా? అది బాలయ్య సినిమా ఫంక్షన్. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, బాలకృష్ణ – రజినీ జంటగా.. వై.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కించిన సూపర్ హిట్ ఫిలిం ‘రాము’. జగ్గయ్య, శారద తదితరులు నటించిన ఈ మూవీ 1987 జూలై 31న విడుదలైంది. ప్రేక్షకాదరణతో అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడింది.
ఇక అదే ఏడాది మద్రాసులో శత దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమల్, చిరు, నాగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మూవీ టీంకి షీల్డ్స్ అందించారు. చిత్ర సీమను ఏలిన ఈ నలుగురు టాప్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం ప్రేక్షకాభిమానులనకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ నలుగురు హీరోలు ఇప్పుడు 60 ప్లస్ అయినా కానీ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తున్నారు. కాకపోతే తండ్రి డా.డి.రామా నాయుడు నిర్మించిన ఈ సినిమా ఫంక్షన్‌లో విక్టరీ వెంకటేష్ ఒక్కడే మిస్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 1988లో సురేష్ సంస్థలోనే ‘రాముడు భీముడు’ మూవీ చేశాడు బాలయ్య.