ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే అతి కొద్ది గొప్ప నటుల్లో ఒకరు కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్టు నుండి నిర్విరామంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేసిన హీరో. ఆయన నటనకు ఫిదా కాని వారు ఉండరు.
ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే అతి కొద్ది గొప్ప నటుల్లో ఒకరు కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్టు నుండి నిర్విరామంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేసిన హీరో. ఆయన నటనకు ఫిదా కాని వారు ఉండరు. కమల్ బహుముఖ ప్రజాశాలి. హీరోగానే కాకుండా దర్శకుడు, రచయిత, సంగీతం వంటి విభాగాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రతి సినిమా ఓ కలికితురాయి. కమల్ హాసన్ తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. తమిళ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి కలెక్షన్లు రాబట్టాయి. సాగర సంగమం, ఇంద్రుడు- చంద్రుడు, స్వాతిముత్యం, శుభ సంకల్పం వంటి తెలుగు సినిమాలే కాకుండా తమిళ డబ్బింగ్ సినిమాలైన గుణ, ద్రోహీ, సతీలీలావతి, ఎర్ర గులాబీలు, దశావతారం.. ఇక లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఇప్పటి విక్రమ్ మూవీ వరకు అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.
అయితే ఈ సినిమా అన్నింటిలో భామనే సత్య భామనే (తమిళంలో అవ్వాయి షణ్ముగి)లో ఢిపరెంట్ రోల్‌లో కనిపిస్తారు విలక్షణ నటుడు కమల్ హాసన్. అందులో కుమార్తె కోసం బామ్మ వేషంలోకి మారి.. మామగారింట్లో పాపకు ఆయాగా ఉంటాడు. ఈ సినిమాలో కమల్ డ్యూయెల్ రోల్ చేశారు. ఈ సినిమాలో ఆయన నటన నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. ఈ సినిమాలో ముఖ్యపాత్ర ధారులుగా జెమినీ గణేష్, మీనా,హీరా, నాజర్, నగేష్, మణివన్నన్, ఢిల్లీ గణేష్, బాలసుబ్రమణ్యం తదితరులు నటించారు. ఈ సినిమా తమిళంలోనే కాదూ తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను హిందీలో 420 పేరుతో కమల్ హాసన్ దర్శకత్వం వహించి నటించారు. అక్కడ కూడా భారీ హిట్ అందుకుంది. అయితే ఇందులో కమల్ హాసన్ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా..? అదేనండి కమల్ ముద్దుల తనయగా, తండ్రి కోసం పరితపించే కూతురుగా కనిపించిందీ కదా ఆ చిన్నారి.
ఆ చిన్నారిన పేరు ఆన్ అన్నా, 1996లో విడుదలైన ఈ సినిమాకు ఆ ఏడాది తమిళనాడు ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. ఆ తర్వాత హిందీలో కూడా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ హిట్ మూవీ హేరా ఫేరీలో కూడా కనిపించింది. ఆమె పూర్తి పేరు అన్ అలెక్సియా అన్రా. ఆ తర్వాత సినిమాల నుండి దూరమైన ఆమె.. ప్రస్తుతం ఎంటర్ ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. లెజండరీ కమల్ హాసన్ పక్కన నటించడం తనకెంతో గర్వంగా ఉందని తెలిపింది. ఆయనతో నటించడం వల్లే ఎన్నో నటన పాఠాలను నేర్చుకున్నట్లు తెలిపింది. కమల్ సార్ డైలాగ్ ఎలా చెప్పాలో, మాడ్యులేషన్ గురించి చెప్పేవారని ఆ నాటి జ్ఞాపకాలను పంచుకుంది. ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో వ్యాపార వేత్తగా స్థిరపడినట్లు తెలుస్తోంది.