ఈ ఫోటోలో విశ్వనటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ని చాలా ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు కదా.. చూస్తుంటే చాలా క్రితం పిక్ అని తెలిసిపోతుంది. పక్కనున్నది ఎవరబ్బా? అనుకుంటున్నారా?. ఆమె కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తే.
ఈ ఫోటోలో విశ్వనటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ని చాలా ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు కదా.. చూస్తుంటే చాలా క్రితం పిక్ అని తెలిసిపోతుంది. పక్కనున్నది ఎవరబ్బా? అనుకుంటున్నారా?. ఆమె కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తే. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. కథానాయికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు మాలీవుడ్ ఛానల్స్‌లోనూ వర్క్ చేసింది. బాగా గమనిస్తే కాస్త గుర్తు పట్టొచ్చు కానీ కళ్లద్దాలు ఉండడంతో కనిపెట్టడం కష్టమే. ఇంతకీ ఆమె ఎవరంటే.. పేరు అభిరామి. అసలు పేరు దివ్య గోపి కుమార్. కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది.
1995లో ‘కథాపురుషన్’ అనే మలయాళీ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైంది. తర్వాత పూర్తి స్థాయి హీరోయిన్గా మాతృభాషతో పాటు సౌత్ ఫిలింస్‌లో యాక్ట్ చేసింది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్తూ.. ‘కమల్ సార్‌తో ఇది నా ఫస్ట్ ఫోటో. మర్చిపోలేని జ్ఞాపకం..ఫ్యాన్ గర్ల్ మూమెంట్’ అంటూ కమల్‌తో ఉన్న త్రో బ్యాక్ పిక్ షేర్ చేసింది. హైలెట్ ఏంటంటే.. కొద్ది కాలం తర్వాత తన ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ పక్కన కథానాయికగా నటించింది.
‘విరుమాండి’ అనే తమిళ్ మూవీ తెలుగులో ‘పోతురాజు’ పేరుతో విడుదలైంది. అలాగే కమల్ ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ చిత్రాల్లో కథానాయిక పూజా కుమార్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పింది. గ్లామర్, టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్ రాలేదనే మాట ఫిలిం వర్గాల్లో వినిపించేంది. శ్రీహరి హీరోగా వచ్చిన ‘థ్యాంక్యూ సుబ్బారావ్’ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘చార్మినార్’ తర్వాత ‘చెప్పవే చిరుగాలి’ చేసింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి తర్వత కాస్త గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ స్టార్ట్ చేసింది. ఎక్కువగా తమిళ్, కన్నడ భాషల్లో అవకాశాలు వస్తుండడంతో అక్కడే కంటిన్యూ అవుతోంది అభిరామి.