విక్రమాదిత్యా- శ్రీవాణి.. ఈ జంట గురించి బుల్లితెర, యూట్యూబ్ చూసే వాళ్లకు సెపరేట్ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్లు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. సీరియల్స్, టీవీ షోస్ తోనే కాకుండా యూట్యూబ్ వీడియోలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వీరికి సోషల్ మీడియాలోనూ ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది.
సీరియల్స్ తో శ్రీవాణి ప్రేక్షకాదరణ పొందగా.. విక్రమాదిత్య మాత్రం తన కామెడీ టైమింగ్, తన డాన్స్ మూవ్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే విక్రమాదిత్య 40వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీళ్లు అడపాదడపా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లోనూ మెరుస్తుంటారు.
తాజాగా వీళ్లు నటించిన ఓ స్కిట్ కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఆ ప్రోమోలో విక్రమాదిత్యా- శ్రీవాణి ఇద్దరూ రియల్ క్యారెక్టర్లలోనే నటించారు. స్కిట్‌లో బాబు తన భార్యకు ముద్దు పెట్టగా.. ఉత్తుత్త పెళ్లానికి ఒక ముద్దా? నాది ఒరిజినల్ పెళ్లాం అంటూ శ్రీవాణిని పట్టుకుని ముద్దుల వర్షం కురిపిస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. విక్రమాదిత్య- శ్రీవాణి పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.