డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ 'లైగర్'. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇక రిలీజ్ ముందే ట్రైలర్, సాంగ్స్, డైలాగ్స్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం సినిమా థియేట్రికల్ రిలీజ్ కాగా.. సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 90 కోట్ల వరకు జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు సినిమా రిజల్ట్ వచ్చేసరికి, రిలీజ్ ముందు ప్రమోషన్స్ లో విజయ్, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి చేసిన స్టేట్ మెంట్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాయి. లైగర్ సినిమాకు గతంలో రూ. 200 కోట్లు ఓటిటి ఆఫర్ వస్తే.. అది చాలా చిన్న నెంబర్ అని, థియేటర్స్ లో ఇంకా ఎక్కువ రాబడతానని విజయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ట్వీట్ ఆధారంగా సినిమాపై ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా రిజల్ట్ చూస్తే.. మిక్సడ్ టాక్ వినిపిస్తుండగా.. రూ. 200 కోట్లు వసూల్ చేయడమనేది సాధ్యమేనా అని సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. అదీగాక ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ తన నెంబర్ రూ. 200 కోట్ల నుండి స్టార్ట్ చేస్తానని చెప్పాడు. అలాగే ఛార్మి, పూరి కూడా రియాక్ట్ అయ్యారు. మరి ఈ లెక్కన సినిమాపై కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో లైగర్ రిలీజ్ టాక్ ఆధారంగా ప్రొడ్యూసర్ ఛార్మితో పాటు విజయ్ ని కూడా కలిపి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. జనరల్ గా సినిమాపై అంచనాలు క్రియేట్ చేయడం అనేది ఈజీనే.. కానీ సినిమాలో అంచనాలు సెట్ చేసేంత కంటెంట్.. అన్నికోట్లు రాబట్టగలిగే దమ్ము ఉండటం ముఖ్యమని నెట్టింట ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. లైగర్ సినిమా వసూళ్లు రూ. 200 కోట్ల సంగతి తర్వాత గాని ముందు బ్రేక్ ఈవెన్ అవ్వనివ్వండి అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అంతేగాక పూరి మీద ఉన్న నమ్మకంతోనే లైగర్ ఓటిటి ఆఫర్ వద్దనుకున్నట్లు ఛార్మి కూడా గతంలో తెలిపింది. మరి గతంలో విజయ్ చేసిన ట్వీట్, ప్రమోషన్స్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మరి లైగర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Too little. I’ll do more in the theaters. pic.twitter.com/AOoRYwmFRw — Vijay Deverakonda (@TheDeverakonda) June 21, 2021