సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక మ్యూజిషియన్‌గా కెరీర్ ప్రారంభించి. ఆ తర్వాత జబర్దస్త్ అనే కామెడీ షోతో మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా, హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. బుల్లితెరలో సుడిగాలి సుధీర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్లో ఒక హీరోకి ఉన్న రేంజ్‌ని బుల్లితెరలో ఉంటూనే మెయిన్టైన్ చేస్తున్నాడు.
ఇటీవల సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత జబర్దస్త్ కు వ్యతిరేక, అనుకూల వర్గాలుగా కొంత విమర్శలు, ప్రతివిమర్శలు జరగడం చూశాం. గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ ను వెళ్లిపోయి కాస్త గ్యాప్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ సైతం తిరిగి వచ్చేసినట్లేనని చెబుతున్నారు. ఒక స్పెషల్ ఈవెంట్లో మళ్లీ సుడిగాలి సుధీర్ కనిపించాడు.
అందుకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే రీ ఎంట్రీ తర్వాత సుడిగాలి సుధీర్‌కు అందరూ పంచులు మీద పంచులు వేస్తున్నారు. వేరే ఛానల్‌కు వెళ్లొచ్చాక పరిస్థితులు ఇంతే ఉంటాయి. ఒకసారి వెళ్లిపోయాక వస్తే స్థానాలు కూడా మారిపోయాతంటూ హైపర్ ఆది, ఇమ్మాన్యూయేల్ వంటి వారంతా కౌంటర్లు వేశారు. అంతేకాకుండా స్కిట్లోనూ సుడిగాలి సుధీర్ వరుస పంచులు వేస్తూనే ఉన్నారు.
రాంప్రసాద్ చేతులు నొక్కించుకుంటూ కామెంట్లు చేయగా.. హైపర్ ఆది మోకాలు నొప్పి అంటూ పిలుస్తాడు. సుధీర్ వచ్చి కింద కూర్చోగా.. “చూశారా కావాలనే కిందకొచ్చేస్తాడు.. మనల్ని బ్యాడ్ చేయడానికి” అంటూ కామెంట్ చేశాడు. సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో హెరత్తిస్తున్నారు. సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ.. ఆది పంచులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.