Vijay: కొంతమంది యువకులు చిన్నచిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. చావే సమస్యకు ఆఖరి పరిస్కారంగా భావిస్తున్నారు. వారికోసం బతికే వారిని కన్నీట్లో ముంచి వెళ్లిపోతున్నారు. తాజాగా, విజయ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన చావు గురించి ట్విటర్లో పోస్టు పెట్టాడు. తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన గుణబాలన్ హరి కరణ్ తమిళ సూపర్ స్టార్ విజయ్‌కి వీరాభిమాని. తన ట్విటర్లో కూడా తల్లి,తండ్రి, విజయ్ అన్న అని రాసుకునేంత అభిమానం అతడి. ఏమైందో తెలియదు కానీ, 20వ తేదీ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘‘ వీడ్కోలు స్నేహితులారా.. నేను ఇప్పుడు వెళ్లిపోవాలి. ఎప్పుడు తిరిగి వస్తానో నాకు తెలియదు. మిమ్మల్ని అందర్నీ మిస్ అవుతాను’’ అని రాసుకొచ్చాడు. విజయ్ ఫోటో పెట్టి కొన్ని హ్యాష్ ట్యాగులు కూడా జోడించాడు. మరుసటి రోజు 21వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం హరి కరణ్ చివరి ట్విటర్ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హరి కరణ్ చావటానికి ముందే అతడి చివరి పోస్టు చూసిన కొంతమందికి కరణ్ ఎందుకలా పెట్టాడో అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన తర్వాత.. ‘‘అయ్యో! ఏదో ఊరికే అలా పెట్టాడని అనుకున్నాం. కానీ, ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదు’’.. ‘‘ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చినపుడు మీ అమ్మ ముఖం చూడండి. ఆ ఆలోచనే రాదు.. అన్ని సమస్యలకు సూసైడ్ పరిస్కారం కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, హరి కరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ధ్రువీకరణ అయిన వెంటనే ఓ వ్యక్తి దానిపై పోస్టు పెట్టాడు. కానీ, కొంతమంది ‘అసలు హరి నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా?’ అంటూ పోస్టు పెట్టిన వ్యక్తిని ప్రశ్నలు వేసి విసిగించారు. చివరకు హరి నిజంగానే చనిపోయాడని తెలిసి బాధపడ్డారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విజయ్ వీరాభిమాని చివరి ట్విటర్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Bye Guys ❤️ Naan ipo pokanum ♂️♂️ epo thirumpa varuvan nu theriyala Miss you all #Varisu #Beast #Thalapathy67 @actorvijay pic.twitter.com/vYRiE66LMw — Hαɾιƙαɾαɳ-K ᵛⁱʲᵃʸ ᵐᵃᶠⁱᵃ⁽ᴴᵉᵃᵈ⁾ (@Harikaran1721) August 20, 2022 ఇవి కూడా చదవండి : ఈ ఏడాది హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాలు!