సినిమా కావొచ్చు, టీవీ షో కావొచ్చు.. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టడం అస్సలు తగ్గరు. ఎంటర్ టైనర్ మెంట్ అనే పదానికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. సాధారణంగా డ్యాన్స్ షో అంటే.. కంటెస్టెంట్స్ వస్తారు, డ్యాన్స్ చేస్తారు, జడ్జిమెంట్ తీసుకుని వెళ్లిపోతారు. కొన్నాళ్ల ముందు వరకు ఇదే టెంప్లేట్ ఫాలో అయ్యేవారు. కానీ ఓ డ్యాన్స్ షోకు కాస్త కామెడీ యాడ్ చేస్తే.. అది నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని ‘ఢీ’ షో నిరూపించింది. అయితే అప్పటివరకు ఈ ప్రోగ్రామ్ కు ఉన్న రేంజ్ ను సుడిగాలి సుధీర్-రష్మీ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఏ డ్యాన్స్ షోకి అందనంత ఎత్తులో నిలబెట్టారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢీ ప్రోగ్రామ్ లో తొలుత రవి-లాస్య టీమ్ లీడర్స్ గా ఉంటూ ఎంటర్ టైన్ చేసేవారు. అది కొంతమేర సక్సెస్ అయింది. ఇక వాళ్ల ప్లేసులో సుడిగాలి సుధీర్-రష్మీ రావడం, యాంకర్ గా ప్రదీప్ రావడంతో ఎంటర్ టైన్ మెంట్ డోస్ ఇంకాస్త యాడ్ అయింది. ఎంటర్ టైన్ మెంట్ డోస్ చాలా పెరిగిపోయింది. ఇక రష్మీని పక్కనబెడితే సుధీర్ తో ప్రదీప్-శేఖర్ మాస్టర్ ఆడుకోవడం అయితే ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించింది. ఒకానొక టైంలో డ్యాన్స్ వీడియోల కంటే వీళ్ల కామెడీ స్కిట్స్ కే ఎక్కువ వ్యూస్ వచ్చేవి. సుధీర్ చేసే కామెడీ కోసమే ప్రేక్షకులు కూడా తెగ వెయిట్ చేసేవారు.
అలాంటి సుధీర్ గత కొన్ని సీజన్ల నుంచి పూర్తిగా ఢీ షోకు దూరమైపోయాడు. సుధీర్ తోపాటు శేఖర్ మాస్టర్ కూడా బయటకెళ్లిపోయాడు. దీంతో హైపర్ ఆది-ప్రదీప్ మాత్రమే ఎంటర్ టైన్ మెంట్ బాధ్యతని తీసుకున్నారు. కానీ కామెడీ విషయంలో సుధీర్ ని మ్యాచ్ చేయలేకపోయారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. దీంతో గత రెండు సీజన్ల నుంచి షో చూసే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇక తాజాగా ‘ఢీ 15’ సీజన్ స్టార్ట్ చేశారు. గత కొన్ని సీజన్లుగా షోకు దూరమైన శేఖర్ మాస్టర్ ని మళ్లీ తీసుకొచ్చారు. ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ ని కూడా షోకు తిరిగి తీసుకురావాలని కామెంట్స్ లో నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు. మరి ‘ఢీ’ మేనేజ్ మెంట్ ఒకవేళ దీన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కోరిక తీరినట్లే! కానీ చూడాలి ఏం జరుగుతుందో? మరి మీలో ఎంతమంది సుధీర్, ‘ఢీ’ షోలోకి రీఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు. దిగువన కామెంట్స్ లో చెప్పండి.