టీవీ షోలు మంచి రేటింగ్ సాధించాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా.. ప్రేక్షకులకి ఇంకేదో కావాలి. అందుకే అభిమానులకి ఆసక్తి కలిగేలా ఈ మధ్య ప్రతి షోలో ఒక లవ్ ట్రాక్ ని కామన్ గా పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డ్యాన్స్ షో ఢీ. ప్రస్తుతం ఇది ఢీ15 గా రన్ అవుతోంది.
టీవీ షోలు మంచి రేటింగ్ సాధించాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా.. ప్రేక్షకులకి ఇంకేదో కావాలి. అందుకే అభిమానులకి ఆసక్తి కలిగేలా ఈ మధ్య ప్రతి షోలో ఒక లవ్ ట్రాక్ ని కామన్ గా పెడుతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి లవ్ ట్రాక్ లు టీవీ షోల్లో చాలానే నడిచాయి. సుదీర్-రష్మీ తో ప్రారంభమైన ఈ లవ్ ట్రాక్ ఆ తర్వాత చాలా టీవీ షోల్లో కొత్త జంటలతో కనువిందు చేశారు. అయితే.. ఇప్పుడు అదే దారిలో హైపర్ ఆది, హీరోయిన్ శ్రద్ధాదాస్ ట్రాక్ చేరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డ్యాన్స్ షో ఢీ. ప్రస్తుతం ఇది ఢీ15 గా రన్ అవుతోంది. కాగా.. తాజాగా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు నిర్వాహకులు.
ఇక యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఢీ15 కొత్త ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తాజా ప్రోమోలో హైపర్ ఆది, హీరోయిన్ శ్రద్ధా దాస్ ల లవ్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఢీ15కి శేఖర్ మాస్టర్, శ్రద్ధా దాస్ జడ్జీలుగా ఉన్నారు. ఈసారి ఛత్రపతి డైలాగ్స్ లతో ఆది శ్రద్ధాని టార్గెట్ చేయగా.. ఆది కోసం శ్రద్ధా.. సెల్యూట్ సినిమాలో “నిన్నేనా నేను చూస్తుంది నిన్నేనా” అనే పాట పాడి ఇంప్రెస్స్ చేసింది. దీంతో ఆది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. శ్రద్ధాదాస్ కి “ఐ లవ్ యు” చెప్పడంతో అందరూ షాకయ్యారు. ప్రెజెంట్ ఆది లవ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి హైపర్ ఆది శ్రద్ధాదాస్ కి ప్రపోజ్ చేయడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలుపండి.