బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో ‘ఎక్ట్రా జబర్దస్త్’ ఒకటి. గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ షో ప్రతివారం ఈటీవీలో ప్రసారం అవుతుంటుంది. ఇక యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఖుష్బూ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఈ సరికొత్త ప్రోమోలో అందరి స్కిట్లు బాగానే ఉన్నాయి. కానీ.. ఆటో రాంప్రసాద్ చేసిన స్కిట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎందుకంటే.. గెటప్ శ్రీను వేసిన ‘లోకులు కాకులు’ ఆంటీ వేషమే హైలైట్ అవ్వడానికి కారణం. అదీగాక లోకులు కాకులు ఆంటీ ముందే గెటప్ శ్రీను.. ఆమె వేషం వేసి ఆమెకే పోటీగా ఎదురు నిలిచి కామెడీ పండించాడు. గత ఎపిసోడ్ లో కైకాల సత్యనారాయణ వేషంతో మెప్పించిన శ్రీను.. ఇప్పుడు లోకులు ఆంటీ వేషంలో కూడా కనిపించి సందడి చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి లోకులు కాకులు ఆంటీ వేషంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.