ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది ఏవేవో వీడియోలు రికార్డ్ చేసి పబ్లిక్ మీద వదులుతుంటారు. అవి కొందరికి నచ్చచ్చు, కొందరిని నొప్పించవచ్చు. నొప్పిస్తే మాత్రం నెటిజన్స్ ఆగ్రహ జ్వాలలు ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా ఓ యువతి మెట్రో రైలులో అలా చేసే సరికి ఆమె మీద నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకే ఆ యువతి ఏం చేసిందంటే?
టిక్ టాక్ వచ్చిన తర్వాత వీడియోలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఏ చిన్న టాలెంట్ ఉన్నా కూడా వీడియో తీసి పెట్టేస్తున్నారు. అదృష్టం బాగుండి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తమ దృష్టిలో టాలెంట్ ఉంది కదా అని ఏ వీడియో పడితే ఆ వీడియో రికార్డ్ చేసి వదులుతా అంటే జనం ఊరుకోరు. ట్రోల్స్ చేయడమో, బూతులు తిట్టడమో చేస్తుంటారు. వ్యూస్ కోసం, లైకుల కోసం, ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి వీడియోలు చేస్తే అస్సలు సహించరు. దోచుకునే రాజకీయ నాయకులను కాలర్ పట్టుకుని ప్రశ్నించడం అంటే చేతకాదు కానీ సరదా కోసం, డబ్బు కోసం, లైకుల కోసం, క్రేజ్ కోసం వీడియోలు రికార్డ్ చేసుకుంటే మాత్రం రేవెట్టేస్తారు. మామూలు రేవు కాదు, చాకి రేవే.
ఈ మధ్య కాలంలో ప్రజల సహనంతో ఆడుకునే బ్యాచ్ ఎక్కువైపోయింది. బైకుల మీద వెళ్తూ లవర్స్ ఇద్దరూ పబ్లిక్ గా ముద్దాడుకోవడం, కొడుకు ఉండగా బైక్ మీద వెళ్తూ భర్తకు భార్య సిగరెట్ తాగించడం, మెట్రో రైళ్లలో స్నానం చేయడం, మెట్రో రైళ్లలో పాడు పనులు చేయడం వంటివి రికార్డ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొందరైతే చుట్టూ మనుషులున్నారన్న సంగతి మర్చిపోయి రొమాన్స్ లో మునిగిపోతున్నారు. మెట్రో రైలు అంటే రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్టు.. కోరికలు తీర్చుకునే అడ్డా అన్నట్టు కొందరు యువతీ యువకులు ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనలు ఎక్కువగా ఢిల్లీ మెట్రో రైళ్ళలో చోటు చేసుకుంటున్నాయి.
దీంతో నెటిజన్స్ ఢిల్లీ మెట్రో పేరు తీసేసి పాప్ కార్న్ హబ్ అని పెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మెట్రో అధికారులు తప్పుడు పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా మెట్రో రైళ్లలో ప్రవర్తించకూడదని తరచూ హెచ్చరిస్తున్నా గానీ కొంతమంది తీరు మారడం లేదు. మెట్రోలో డ్యాన్సులు కూడా చేయడానికి వీల్లేదని మెట్రో అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బాడీ కనబడేలా డ్రెస్ ధరించి.. హిందీ పాటకు డ్యాన్స్ వేసింది. చుట్టూ జనం ఉన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. రైల్లో ఉన్న ప్రయాణికులు టాలెంట్ చూపిస్తుందేంటి అన్నట్టు చూస్తుండగా.. నెటిజన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాగా డ్యాన్స్ చేశావ్ పాప అని మెచ్చుకుంటున్నా గానీ ఎక్కువ శాతం మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకోవాలని ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ చేయడం తప్పు కాదని.. కానీ మెట్రో రైళ్లలో ఇలా చేయడం తప్పని అంటున్నారు. మరి యువతి మెట్రో రైలులో డ్యాన్స్ చేయడం తప్పా? తప్పు కాదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.