బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో వినోదాత్మక ప్రోగ్రామ్ లను తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న 'హోలీ' పండుగ నేపథ్యంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' అంటూ ఓ కొత్త ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అంతా సరదా సరదాగా సాగింది. కానీ..
కొన్నాళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో వినోదాత్మక ప్రోగ్రామ్ లను తెరపైకి వస్తున్నాయి. రెగ్యులర్ గా సాగే ప్రోగ్రామ్స్ తో పాటు పండుగలు, స్పెషల్ మూమెంట్స్ ని బట్టి వినూత్నమైన కార్యక్రమాలను నిర్వాహకులు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న ‘హోలీ’ పండుగ నేపథ్యంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అంటూ ఓ కొత్త ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా.. మార్చి 5న రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాంకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తుంటే.. ఈ హోలీ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా నటి శ్రీదేవి హాజరైంది. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ షోని హోస్ట్ చేశారు.
ఇక ప్రోమో అంతా సరదా సరదాగా సాగింది. కానీ.. అందరినీ పంచులతో ఆడుకునే హైపర్ ఆదిని.. యాంకర్ సౌమ్య రావు మరోసారి స్టేజ్ పై ఆడుకోవడం హైలైట్ గా నిలిచింది. అయితే.. సౌమ్య గతంలో ఓసారి ఆదిని స్టేజ్ పై పంచులతో ఆటాడుకున్నందుకే.. ఆమెకు జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం ఇచ్చారు. దీంతో ఆదికి కరెక్ట్ పర్సన్ నే దింపారని అంతా అనుకున్నారు. వారంతా అనుకున్నట్లుగానే హోలీ ప్రోగ్రాంలో మరోసారి హైపర్ ఆది గాలి తీసింది సౌమ్య. స్టేజ్ మీద స్కూటీపై సౌమ్యని ఎక్కించుకొని తిప్పే టైంలో నానా హడావిడి చేస్తూ.. స్కూటీని హ్యాండిల్ చేయలేకపోయాడు ఆది. దీంతో స్కూటీ దిగాక.. సౌమ్య ఆదితో మాట్లాడుతూ.. “నీకు యాక్టింగ్ రాదు.. కామెడీ రాదు.. ఇప్పుడు బైక్ నడపడం కూడా రాదా?” అని కౌంటర్ వేసింది. ఆమె కౌంటర్ కి ఏమి చేయలేక ఆది తలదించుకున్నాడు. ఇది చూసినవారంతా ఆదిని సౌమ్య మళ్లీ గట్టిగా ఆడుకుంది కదా! అంటున్నారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆది, సౌమ్యల కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.