బుల్లితెరపై టీవీ ఛానల్స్ అన్నీ ప్రతి ఏడాది ఎన్నో అవార్డుల వేడుకలు జరుపుతుంటాయి. వార్షికోత్సవాలు అని, సీరియల్ అవార్డులు అంటూ జరుపుతుంటారు. ఇప్పుడు ప్రముఖ ఛానల్స్ లో ఒకటైన జీ తెలుగులో ‘ఫెంటాస్టిక్ అవార్డ్స్’ అని కొత్తగా అవార్డుల ప్రదానోత్వవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, బిగ్ బాస్ సిరి హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ ఆదివారం క్రిస్మస్ సందర్భంగా ప్రసారం కానున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి సంబందించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో నిండా జీ తెలుగు ఫ్యామిలీకి సంబంధించి అందరు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.
ఇదిలా ఉండగా.. ఫెంటాస్టిక్ అవార్డులలో భాగంగా అవార్డుల పేర్లు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది బెస్ట్ యాంకర్ అవార్డును యాంకర్, నటుడు అకుల్ బాలాజీని వరించినట్లు తెలుస్తోంది. అయితే.. అకుల్ బాలాజీని బెస్ట్ యాంకర్ అవార్డు అందుకోవడానికి రావాల్సిందిగా పిలుస్తూ.. ‘వాగుడు వీరయ్య’ అని సంబోధించాడు యాంకర్ రవి. దీంతో యాంకరింగ్ ని వాగుడు అనడం కరెక్ట్ కాదని.. హర్ట్ అయిన అకుల్ బాలాజీ స్టేజ్ పైకి వెళ్లి.. ‘యాంకరింగ్ ని వాగుడు అనడం బాలేదని.. అందుకు తాను ఈ అవార్డును తీసుకోలేనని చెప్పి స్టేజ్ దిగి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. మరి యాంకరింగ్ ని రవి ‘వాగుడు’ అనడంపై, అకుల్ బాలాజీ స్టేజ్ దిగి వెళ్లిపోవడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.