థియేటర్ యజమానులకు మామూలు రోజుల్లో కంటే పండగ సీజన్ లోనే కలెక్షన్లు బాగా వస్తాయి. పెద్ద హీరోల సినిమాలంటే టికెట్ ధరలు కూడా పెరుగుతాయి. పైగా షోలు కూడా పెరుగుతాయి. కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా ఉండదు. ఈ పండగ సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు తడిగుడ్డ వేసుకుని పడుకుంటారు. సినిమా హిట్ టాక్ వస్తే ఆ జోష్ వేరే లెవల్ లో ఉంటుంది. నగరాల్లో కంటే పట్టణాల్లో కలెక్షన్స్ బాగా వస్తాయి. పండగ సీజన్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది సినిమాలు చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటి సమయంలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే రిపీటెడ్ గా వెళ్లి మరీ చూస్తారు. అలా ఈ సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు దెబ్బా దెబ్బ మీద ఆడుతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు బాగా రాబడుతున్నాయి. చిరు, బాలయ్యల కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టే దిశగా సినిమాలు జోరు చూపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య 3 రోజుల్లోనే వంద కోట్ల మార్క్ దాటేసింది. ఇక వీర సింహారెడ్డి అయితే బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ కలెక్షన్స్ తో అదరగొడుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి 3 రోజులు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాలు చూశారు. దీంతో లాభాలు గట్టిగానే వచ్చాయి. ఆయా సినిమాల థియేటర్ యజమానులు కలెక్షన్స్ తో సంబరాలు చేసుకుంటుంటే.. ఒక థియేటర్ యజమాని మాత్రం తీవ్రంగా నష్టపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ థియేటర్ లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఆడుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా 3 రోజులు ప్రదర్శించగా వచ్చిన కలెక్షన్స్ ని థియేటర్ మేనేజర్.. థియేటర్ లో ఉన్న లాకర్ లో భద్రపరిచారు. బ్యాంకులు 3 రోజులు సెలవు కావడంతో లాకర్ లో ఉంచారు. అయితే తెల్లారి చూస్తే లాకర్ లో ఉండాల్సిన కలెక్షన్లు చోరీకి గురయ్యాయి. దీంతో మేనేజర్, థియేటర్ యజమాని కంగుతిన్నారు. వెంటనే పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల 3 రోజుల కలెక్షన్స్ చోరీకి గురైనట్లు ఒక ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
గుంటూరు జిల్లా పొన్నూరు
పొన్నూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ థియేటర్లో చోరీ
సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులు మూడు రోజుల సెలవు కావడంతో నగదును థియేటర్ లోని లాకర్లో ఉంచిన మేనేజర్
వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి సినిమాల
మూడురోజులు కలెక్షన్ చోరీపొన్నూరు పోలీసులకు ఫిర్యాదు 🤣🤣🤣
— Kumar 🙂 (@MSKumar143) January 17, 2023