మెగాస్టార్ చిరంజీవికి ఈసారి సంక్రాంతి బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత పండగ బరిలో తన సినిమాని దించారు. హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. కలెక్షన్స్ లో ఊచకోత చూపిస్తున్నారు. మిగతా సినిమాల సంగతి అటుంచితే.. తన మూవీకి మాత్రం అస్సలు తగ్గకుండా ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. అరిచి అరిచి గోల గోల చేస్తూనే ఉన్నారు. థియేటర్లు కూడా సంక్రాంతి హడావుడికి తగ్గట్లే కళకళలాడిపోతున్నాయి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ సంబంధించిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండాలి. మాస్, కామెడీ, యాక్షన్.. ఎలిమెంట్స్ కలిపి ఓ సినిమా తీస్తే కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. ఈసారి అదే జరిగింది. వింటేజ్ చిరు కనిపించేలా తీసిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. దర్శకుడు బాబీ.. చిరుని ఎలా ప్రెజెంట్ చేస్తే అభిమానులకు నచ్చుతుందో అదే చేశాడు. దానికి ఫలితమే ఈ బ్లాక్ బస్టర్ టాక్. ఇక ఇందులో చిరుతో పాటు రవితేజ, బాబీ సింహా లాంటి వాళ్లు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతినిస్తున్నారు.
ఇక ఇలా అన్ని విషయాల్లోనూ టాప్ లేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’.. జస్ట్ మూడే మూడు రోజుల్లో రూ.108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. చిరు, ఏనుగుపై ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక దీన్ని చూసిన మెగాఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ‘మెగాస్టారా మజాకా’, ‘అన్నయ్య చిరు రఫ్ఫాడించేశాడు’ అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమా మూడు రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు సాధించిందంటే.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. మరి ‘వాల్తేరు వీరయ్య’ మూడు రోజుల కలెక్షన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#WaltairVeerayya takes over the Box Office like BOSS 😎🔥
108 Crores Gross in 3 days for MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥💥
MEGA⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/n8PszOFt5u
— Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023