మిల్కీ బ్యూటీ తమన్నా, పేరుకు తగ్గట్టే పాలపుంతలా తెల్లగా ఉంటుంది. మేకప్ అవసరం లేని బ్యూటీ. మేకప్ కే అందం కావాలంటే తమన్నాని అడిగి అప్పు తెచ్చుకునేంత అందంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన డీసెంట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’లో తమన్నా ముదిరినట్టు కనిపించింది. అప్పుడే తమ్మూ బ్యూటీ తరిగిపోయిందా అని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఆ సినిమాలో ఆ పాత్రే అలాంటిదని ఇప్పుడు తమన్నా ఫోటో షూట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి కాకపోతే ఏంటి.. గుర్తుందా శీతాకాలంలో ముదురు గులాబీలా కనిపించిన తమన్నా.. ఇప్పుడు లేత గులాబీలా కనబడుతుంది. సినిమా కోసం గ్లామరస్ గా, డీ గ్లామరస్ గా.. ఎలా కావాలంటే అలా తనను తాను మలచుకునే ఈ పాలపుంత.. సినిమాలు అయిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచి తనలో ఉన్న గ్లామరసాన్ని బయటపెడుతుందేమో అనిపిస్తోంది. గ్లామరస సార్వభామ అనే బిరుదు ఉంటే.. ఆ బిరుదు అందుకునే అర్హత తమన్నాకి ఉంది అనేలా సోయగాలతో యువ మనసులను చిత్తు చేస్తోంది.
పాలలో కుంకుమ పువ్వు వేసినట్టు.. పాల లాంటి మృదువైన చర్మం మీద కుంకుమ పువ్వు లాంటి ఎరుపు రంగు దుస్తులు చేరి తమన్నా సోయగాలను ఎరుపెక్కించాయి. ఆ ఎరుపెక్కిన సోయగాలను చూసి యువకులు వెర్రెక్కిపోతున్నారు. ఎవరికుంటుంది ఆ నడుము? నాగుపాములా మెలికలు తిరిగినట్టు, నెలవంక పది రోజులుగా తిండి మానేసి బక్క చిక్కినట్టు.. ఎంత అందంగా ఉందో. మల్లెతీగకే అసూయ పుట్టించేంత సన్నని నడుముతో మైమరిపిస్తోంది. అది నడుమా లేక మల్లె తీగా అనేలా మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఆ చూపుతో ఒక యుద్ధాన్నే ఆపేసేలా ఉంది. పగిలిన గాజు ముక్కలను చేర్చి.. డ్రెస్సు కుట్టినట్టు వెరైటీ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు చూస్తే మతిపోతుంది.
మెట్ల మీద వయ్యారంగా నిలుచుని.. ఆ పైటను అలా కిందకు వదిలేసి.. సోకుల సామ్రాజ్యానికి సుకుమారి అనేలా ఫోజులిచ్చింది. అది నాభి కాదు, సునాభి.. సునామీ నుంచి అయినా తప్పించుకోవచ్చు గానీ ఈ తమన్నా సునాభి నుంచి మాత్రం తప్పించుకోలేమని ఫ్యాన్స్ మాట. ఆ నాభి అందాల్లో మునిగితే గజ ఈతగాళ్లయినా సరే మునిగిపోవాల్సిందే అనేంత మైమరపిస్తుంది. ఫస్ట్ లుక్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో భాగంగా ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. వెరైటీ డ్రెస్సులు వేసి మరీ వెర్రెక్కిస్తోంది. తాకితే కందిపోయేంత ఎర్రగా, ఎరుపెక్కిన సోయగాలతో తానింక లేత గుమ్మనే అని సంకేతాలు ఇస్తోంది.
సోయగాల ఎర వేస్తేనే అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించవచ్చునన్న సూత్రాన్ని బాగా బట్టీ పట్టినట్టుంది. అందుకే సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ తో దండయాత్ర చేస్తోంది. ప్రస్తుతం భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. మరి భోళా శంకర్ తో తమన్నా ఫేట్ మారుతుందేమో చూడాలి.