ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. తీరా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా అని వెయిట్ చేయడం మామూలే అయిపోయింది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సర్కారు వారి పాట’.. ఉచిత ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా తెరకెక్కిన సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 250 కోట్ల కలెక్షన్స్ తో మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సర్కారు వారి పాట నిలిచింది. ఒక రీజినల్ సినిమాగా ఈ సినిమా రికార్డు సెట్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమా విషయంలో మహేష్ తో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెయిడ్ ప్రాతిపదికన రూ. 199 చెల్లించి సినిమాను చూసే విధంగా రిలీజ్ చేశారు. కానీ.. జూన్ 23 నుండి ఎలాంటి చెల్లింపులు లేకుండా సినిమాను ఉచితంగా చూడవచ్చు అమెజాన్ సబ్ స్క్రైబర్లు. అదీగాక ఇకపై సర్కారు వారి పాట సినిమా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చింది.
సాధారణంగా థియేట్రికల్ రిలీజైన సినిమాలు 50 రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తుందని అంటుంటారు. కానీ ఈ సినిమా విడుదలైన 40 రోజులకే ఓటిటిలో వస్తుండటం గమనించవచ్చు. అంతేగాక ఈ మధ్య ఎంత పెద్ద సినిమాలైనా థియేటర్స్ వద్ద రెండు వారాలకు మించి నిలబడటం లేదు. అందుకే ఆ ఊపు తగ్గకముందే త్వరగా ఓటిటిలో రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. మరి సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
this complete entertainer is now coming for you 🍿#SarkaruVaariPaataOnPrime, June 23 pic.twitter.com/4Kt1BFJC8D
— amazon prime video IN (@PrimeVideoIN) June 15, 2022