మంచు విష్ణు.. మా అధ్యక్షుడిగా, సినిమా హీరోగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘మా’కి సంబంధించి కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక.. జిన్నా సినిమా గురించి మరో క్రేజీ అప్‌డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో ఒకరు జిల్లా కొరియన్, జపనీస్, చైనీస్ వంటి భాషల్లో డబ్ అవుతుంది నిజమేనా? అంటు ప్రశ్నించగా.. విష్ణు అవును అంటూ సమాధానం చెప్పాడు. అయితే అది ఉడికించాలని చేసిన ట్వీట్‌లా అనిపించింది.
జిన్నా విడుదల సందర్భంగా మంచు విష్ణు వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తున్న, వచ్చే ట్రోల్స్ గురించి గతంలోనూ విష్ణు స్పందించడం చూశా. మరోసారి తాజాగా ట్రోల్స్ పై మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. తనను కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నట్లు మంచు విష్ణు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కొందరు డబ్బులిచ్చి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారంటూ ఎప్పటినుంచో అంటూనే ఉన్నాడు. అయితే తనపై ట్రోల్స్ చేయిస్తోంది ఎవరో తనకి తెలుసని చెప్పుకొచ్చాడు. “నన్ను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. ఆ ఒక్కడు ఎవరన్నది ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న వారందరికీ తెలుసు. వాళ్ల పేరు నేను నా నోటితో చెప్పాలను కోవడం లేదు”
Yes. Want to buy the rights and release it? https://t.co/hoTlQ6Wl1U
— Vishnu Manchu (@iVishnuManchu) October 15, 2022
“నేను న్యూటన్ మూడో సూత్రాన్ని బాగా నమ్ముతాను. ఎవ్రీ యాక్షన్ హ్యావ్‌ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం సొసైటిలోకి పాజిటివ్ పంపితే పాజిటివ్ తిరిగి వస్తుంది. నెగెటివ్ పంపితే నెగెటివిటీనే మనకు వస్తుంది. నేను దేవుడిని, ప్రకృతిని బాగా నమ్ముతాను. మనం ఏదైతే ఇస్తామో.. అదే తిరిగి వస్తుంది. నాపై ట్రోల్స్ చేయిస్తున్న వారి పేరును కూడా నా నోటితో చెప్పాలి అని నేను అనుకోవడం లేదు. ఇంతక ముందు నా మీద ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. నేను ఎప్పుడైతే మా ఎన్నికల్లో పోటీ చేశానో, మా అధ్యక్షుడిగా గెలిచానో.. అప్పటి నుంచే నాపై ట్రోలింగ్ జరగడం స్టార్ట్ అయ్యింది” అంటూ తనపై వచ్చే ట్రోలింగ్ విషయం గురించి మరోసారి ప్రస్తావించాడు. ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలా జరుగుతోంది అనే విషయాలను మాత్రం చెప్పలేదు.