టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు హీరోలుగా తెరంగ్రేటరం చేశారు. అయితే అందులో కొంత మంది మాత్రమే స్టార్ హీరోలుగా ఎదిగి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలా తండ్రి వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన వ్యక్తి.. కింగ్ నాగార్జున. అక్కినేని నట వారుసుడిగా టాలీవుడ్ కి నాగార్జున పరిచయమయ్యారు. తనదైన నటనతో అభిమానులకు కింగ్ అయ్యాడు. అమ్మాయిల మనస్లుల్లో మన్మథుడిగా నిలిచాడు. ఇటీవల ఘోస్ట్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జునకు సంబంధించి ఓ వింటేజ్ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటి పెళ్లికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ కింగ్.. అక్కినేని నాగార్జున వ్యక్తిగత, సినీ జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మెుఘల్ అయిన దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జునకి మెుదట విహాహం జరిగింది. వారిద్దరి కుమారుడే హీరో నాగచైతన్య. అయితే కొంతకాలం తరువాత వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారని టాక్. తర్వాత నాగార్జున అలనాటి హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ్, అమల కుమారుడే అక్కినేని అఖిల్. అయితే లక్ష్మితో విడిపోయి.. అమలను పెళ్లి చేసుకున్నప్పటికీ దగ్గుబాటి కుటుంబంతో అక్కినేని కుటుంబానికి మంచి సత్సంబంధాలే కొనసాగుతున్నాయి. తాజాగా నాగార్జున-లక్ష్మిల అలనాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాగ్ ఈ ఫొటోలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. తమ అభిమాన హీరో అప్పట్లో ఇలా ఉన్నాడా? అంటు కొందరు నెటిజన్స్ అంటుండగా.. పాత ఫొటో చూసే అదృష్టం కలిగిందని మరికొందరు అనుకుంటున్నారు. ఆ పెళ్లి సమయంలో నాగార్జున ప్రస్తుతం నాగ చైతన్య కనిపిస్తున్నట్టుగానే ఉన్నాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. అయితే మొత్తానికి నాగార్జున మొదటి పెళ్లి ఫోటో మాత్రం జనాలను తెగ ఆకట్టుకుంటోంది. 1984లో ఈ పెళ్లి జరగ్గా.. 1990లో విడాకులు తీసుకున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బ్రాహ్మాస్ర్త తో పాటు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఘోస్ట్’ సినిమాలో నాగ్ నటించి ప్రేకక్షులను మెప్పించారు. ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
నాగార్జున మొదటి పెళ్లి ఫోటో. ఇక్కడ మాత్రం అచ్చం చైతు లాగే ఉన్నాడు 😘 @iamnagarjuna @chay_akkineni pic.twitter.com/6uVnNKbQ5Q
— Ravindranath Sriraj (@ravindraraj11) October 11, 2022