కరోనా కాలంలో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాస్ట్రో మూవీ “హాట్ స్టార్” ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే మీడియాకి స్పెషల్ షోని ఏర్పాటు చేశారు చిత్ర బృందం. మరి.. మాస్ట్రో మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
హీరో అరుణ్ పియానో ప్లేయర్. మ్యూజిక్ పై ఫోకస్ కోసం అంధుడిగా అందరిని నమ్మిస్తూ ఉంటాడు. కానీ.., నిజానికి అరుణ్ కి ఎలాంటి కంటి లోపం ఉండదు. ఇక పియానో ప్లేయర్ గా క్లాసులు చెప్తూ జీవించే అరుణ్ కి హీరోయిన్ సోఫీ పరిచయం అవుతుంది. కానీ.., అప్పటికే హీరోయిన్ రెస్టారెంట్ నష్టాల కారణంగా అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. అరుణ్ ఆ హోటల్ లో రోజూ పియానో షోలు ఇచ్చి, హోటల్ లాభాల బాట పట్టేలా చేస్తాడు. అయితే.. ఆ హోటల్ లో అరుణ్ పెర్ఫామెన్స్ చూసి ఇంప్రెస్ అయిన మోహన్.. అరుణ్ కి తన తన రెండో భార్య ఇంట్లో ప్రైవేట్ కన్సర్ట్ చేసే అఫర్ ఇస్తాడు. అలా.. మోహన్-సిమ్రన్ ల వెడ్డింగ్ డే రోజు వాళ్ల ఇంటికి వెళ్లిన అరుణ్ అక్కడ అనూహ్య పరిణామాలును ఎదుర్కొంటాడు. ఇక్కడ నుండి అరుణ్ జీవితం ఎలా మలుపులు తిరిగిందన్నదే మిగిలిన కథ
విశ్లేషణ:
ఒకప్పుడు రీమేక్ లు అంటే సేఫ్ ప్రాజెక్ట్ అనే నమ్మకం ఉండేది. కానీ.., ఇప్పుడు ప్రేక్షకుల్లో సినిమా నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది. రీమేక్ ని అనలైజ్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఉన్నది ఉన్నట్టు తీస్తే.. ఏమి మార్పులు చేయకుండా దించేశారు అని నిట్టూరుస్తున్నారు. మార్పులు చేస్తే.. ఆ సోల్ మిస్ అయింది అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మాస్ట్రో పరిస్థితి కూడా ఇంతే. బాలీవుడ్ లో అంధాదున్ సంచలన విజయం సాధించింది. అంతటి మ్యాజిక్ అయితే మాస్ట్రోలో లేదు. కానీ.., ఈ రీమేక్ ఏదో చుట్టి పారేసింది కాదు. మాస్ట్రో కోసం చిత్ర యూనిట్ చాలానే కష్ట పడింది.
ప్రతి 15 నిమిషాలకి ఒక ట్విస్ట్ వచ్చేలా దర్శకుడు మేర్లపాక గాంధీ అద్భుతంగా స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నాడు. దీంతో.. ఫస్ట్ ఆఫ్ కథనం పరుగులు పెట్టింది. కానీ.., కానీ ద్వితీయార్ధంలో మాత్రం ‘మాస్ట్రో’ బిగి సడలింది. సెకండ్ ఆఫ్ లో కూడా చాలా ట్విస్ట్ లు ఉన్నా, అవి అంత లాజిక్ గా అనిపించవు. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే మాస్ట్రో రేంజ్ మరోలా ఉండేది. ఇక నితిన్ పాత్రకి తగ్గ లుక్ లో కనిపించాడు గాని.., నటనలో మాత్రం ఆయుష్మాన్ ఖురానతో పోటీ పడలేకపోయాడు. కానీ.., తమన్నా మాత్రం సిమ్రాన్ పాత్రలో దుమ్ము లేపేసింది. కేవలం తమన్నా క్యారెక్టర్ కారణంగా మాస్ట్రో ఒక మెట్టుపైకి ఎక్కిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మాతృకలో రాధికా ఆప్టే పాత్రకి ఏ మాత్రం తగ్గకుండా తమన్నా ఇందులో నటించింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
మాస్ట్రో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత బాగా వచ్చిందో, పాటలు అంతలా తేలిపోయాయి. యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పుకోవాలి. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇక చివరగా దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోని స్టైలిష్ గా ప్రెజెంట్ చేయగలిగాడే తప్ప, అంధాదున్ స్థాయిలో ఉత్కంఠతని కలిగించలేకపోయాడు. ఈ ఒక్క విషయంలో తప్పించి, మేర్లపాక గాంధీ కష్టాన్ని కూడా తక్కువ చేయలేము.
ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్:
చివరి మాట: మాస్ట్రో.. ఓటీటీ కాబట్టి తప్పక చూడవచ్చు.
రేటింగ్: 2.5/5