సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు గమ్మత్తైన సంఘటనలు జరుగుతుంటాయి. కథ, టైటిల్ కాపీ ఆరోపణల దగ్గరి నుంచి రిలీజ్ క్లాష్ వరకు రకరకాల అలిగేషన్స్. గతంలో పేర్ల విషయంలో పేచీ ఎక్కువగా ఉండేది.
సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు గమ్మత్తైన సంఘటనలు జరుగుతుంటాయి. కథ, టైటిల్ కాపీ ఆరోపణల దగ్గరి నుంచి రిలీజ్ క్లాష్ వరకు రకరకాల అలిగేషన్స్. గతంలో పేర్ల విషయంలో పేచీ ఎక్కువగా ఉండేది. రమేష్ బాబు ‘సామ్రాట్’ టైటిల్ గురించి కృష్ణ-ఎన్టీఆర్‌ల మధ్య మనస్ఫర్థలు వచ్చాయని చెప్తుంటారు. చివరకు బాలయ్య సినిమాకి ‘అశోక సామ్రాట్’ పేరు ఫిక్స్ చేశారు. తర్వాత కూడా ‘కత్తి’ (గుణ శేఖర్), ‘కళ్యాణ్ రామ్ కత్తి’.. ‘ఖలేజా’, ‘మహేష్ ఖలేజా’ వంటివి కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక రిలీజ్ డేట్స్ విషయంలోనూ వార్స్ జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ చిన్న సినిమా ఏకంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. అది కూడా ఒకే రోజు కావడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీ కాంత్, మిల్కీబ్యూటీ తమన్నా, మోహన్ లాన్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’. ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ‘కావాలయ్యా’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దీని తెలుగు వెర్షన్ బుధవారం (జూలై 26) హైదరాబాద్‌లో తమన్నా విడుదల చేయబోతోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆగస్టు 10న పాన్ ఇండియా స్థాయిలో (తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవనుంది.
ఇక అదే రోజున మలయాళంలోనూ ‘జైలర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అది రజినీ ‘జైలర్’ కాదు. ధ్యాన్ శ్రీనివాసన్ అనే మాలీవుడ్ యాక్టర్ చేసిన ‘జైలర్’. ఈ రెండు సినిమాలకు కథ విషయంలో ఎలాంటి పోలిక లేనప్పటికీ.. ఒకే టైటిల్ కామన్ ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తుందని మలయాళ మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తమది చిన్న సినిమా అని.. టైటిల్ మారిస్తే ఆ ప్రభావం సినిమా మీద పడుతుందనేది వారి అభిప్రాయం. కానీ ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో రెండు ‘జైలర్’ లు ఆగస్టు 10నే విడుదలవబోతున్నాయి. దేని రిజల్ట్ ఏంటనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
ఇది కూడా చదవండి : తమన్నా సాంగ్‌కి స్టెప్పులు అదరగొట్టిన సిమ్రాన్! వీడియో వైరల్
Jailer vs Jailer CLASH confirmed for August 10th.#Jailer pic.twitter.com/289OTlfbSc
— Manobala Vijayabalan (@ManobalaV) July 24, 2023