సోషల్ మీడియా వినియోగం విస్తృతమయ్యాక, పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాక రీల్స్ చెయ్యడం అనేది రోటీన్ అయిపోయింది. టిక్ టాక్ బ్యాన్ చేస్తే ఏముంది? ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటివి ఉన్నాయి కదా.. ఎంచక్కా ఎవరికి నచ్చిన రీల్స్ వారు ఎంచక్కా అప్‌లోడ్ చేసేసుకోవచ్చు.
ఉరుకులు పరుగుల జీవితం.. ఒక్కోసారి రోజుకి 24 గంటలున్నా సరిపోవు అనేంత గజిబిజిగా సాగిపోయే కాల చక్రంలో.. మనిషి వినోదం కోసం ఎంచుకునే ఏకైక మార్గం సినిమా.. ఓటీటీలల్లో వెబ్ సిరీస్‌లు, ఇతరత్రా షోలవీ చూసినా సినిమాకుండే క్రేజ్ వేరు. ఇక సోషల్ మీడియా వినియోగం విస్తృతమయ్యాక, పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాక రీల్స్ చెయ్యడం అనేది రోటీన్ అయిపోయింది. టిక్ టాక్ బ్యాన్ చేస్తే ఏముంది? ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటివి ఉన్నాయి కదా.. ఎంచక్కా ఎవరికి నచ్చిన రీల్స్ వారు ఎంచక్కా అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఫ్యాన్స్, నెటిజన్ల సంగతి పక్కన పెడితే, సెలబ్రిటీలు చేసే రీల్స్ మాత్రం మామూలుగా వైరల్ అవ్వవసలు. బాషతో సంబధం లేకుండా యంగ్ అండ్ సీనియర్ హీరోయిన్స్ వీడియోస్ షేర్ చేస్తే ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే. రీసెంట్‌గా ఓ డ్యాన్సింగ్ క్వీన్, మరో యంగ్ బ్యూటీ సాంగ్‌కి సూపర్బ్ స్టెప్పులేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతుంది.
సెలబ్రిటీలు తమ క్రియేటివిటీకి, టెక్నాలజీని యాడ్ చేసి, అందుబాటులో ఉన్న పలు ఫిల్టర్స్‌తో వీడియోస్ చేయడం ప్యాషన్‌గా మారింది. ఇటీవల బాగా పాపులర్ అయిన సాంగ్ ‘కావాలయ్యా’. సూపర్ స్టార్ రజినీ కాంత్, మిల్కీబ్యూటీ తమన్నా, మోహన్ లాన్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్ తదితరులు నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. శిల్పా రావ్ అద్భుతంగా పాడిన ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రజినీ మేనరిజమ్స్ సూపర్బ్ అనిపిస్తే.. తమన్నా గ్లామర్ అండ్ డ్యాన్స్ మూమెంట్స్ మెంటలెక్కించేశాయి. అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్లతో, అందాలారబోయడానికి నో రూల్స్ బోర్డ్ పెట్టుకున్నట్టు పరువాల జాతర చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది తమన్నా.
ఇప్పటికే కొంతమంది నెటిజన్లు, మూవీ లవర్స్ ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ యాక్ట్రెస్, డ్యాన్సింగ్ క్వీన్ సిమ్రాన్ కూడా తమన్నా పాటకు తన స్టైల్లో స్టెప్పులేసి సర్‌ప్రైజ్ చేశారు. ఒక్క క్షణం వీడియోలో ఉన్నది తమన్నానా, సిమ్రానా? అనేది అర్థం కాక షాక్ అవుతాం. సిమ్రాన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వయసులోనూ దుమ్ము దులిపేసేలా డ్యాన్స్ చేశారు. ‘47 ఏళ్ల ఏజ్‌లోనూ అదరగొట్టేశారు.. డ్యాన్స్‌లో మీకు మీరే పోటీ, మీకెవరూ రారు సాటి’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాలాలో తెగ చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ వీడియోకి AI Deepfake యాప్ యూజ్ చేశారు. ‘అరే, నిజంగానే సిమ్రాన్ అనుకున్నామే.. ఈ టెక్నాలజీ కారణంగా ఏది ఒరిజినలో గుర్తు పట్టడం కష్టమైపోయింది’ అంటున్నారు నెటిజన్లు.
AI 😲 Simran 😲
— Christopher Kanagaraj (@Chrissuccess) July 11, 2023